గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 83వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

83. రాజిల్లఁ జేయ నను నీ జాతకం బెవరు నీ జాలి చాలదొ భువిన్.

సాజంబుగా తమరి రాజీవ నేత్రములె రాజిల్లఁ జేయును కదా.

యీ జాతి గౌరవము మా జీవమై నిలువఁగాఁ జేసి పొంగుమెదలో.

నేజీవినైనఁ గని సాజంపు ధర్మమున రాజిల్లఁ జేసెడి సతీ!

భావము.

ఏ ప్రాణినైననూసరే నీ సహజమైన ధర్మస్వభావమున రాజిల్లునట్లుగా 

చేసెడి ఓ సతీ మాతా! భూమిపై నన్ను ప్రకాశింపఁ జేయుటకు ఈ 

జాతకమెవరమ్మా? నీకు నాపై గల జాలి చాలదా? మీ ప్రకాశవంతమయిన 

నేత్రములే సహజంగానే రాజిల్లఁ జేయును కదా. ఈ హైందవ జాతి 

యొక్క గౌరవము మా ప్రాణమై నిలుచునట్లుగా చేసి నీవు మదిలో 

సంతసింపుము జననీ! 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.