గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, సెప్టెంబర్ 2023, శుక్రవారం

శ్రీన్నీవక్షమునందు నిల్పి .. శ్రీమన్నారాయణ శతకమున 1వ పద్యము . రచన. చింతా రామకృష్ణారావు. గానము శ్రీమతి దోర్బల బాలసుజాత.

 జైశ్రీరామ్

శ్రీమన్నారాయణ శతకము

.(అష్టోత్తర శత ద్విత్వ నకార ఏక ప్రాస శార్దూలావళి)

రచన. చింతా రామకృష్ణారావు.

1. శా. శ్రీన్నీవక్షమునందు నిల్పి, సుజన శ్రేయంబుఁ జేకూర్చు నీ     

వన్నన్ మాకుఁ బ్ర మోదమే. సుగుణ సౌహార్ద్రంబులన్ మాకు మే

మున్నన్నాళ్ళునుఁ దక్కఁ జేయుదువు,  దీనోద్ధారకా! దేవ! శ్రీ

మన్నారాయణ! సత్య సన్నుత గుణా! మద్భాగ్య సంవర్ధనా

భావము.

దీనోద్ధారకా! దేవాది దేవా! సత్యము కారణముగా సన్నుతింప బడెడి 

గుణములు కలవాడానాభాగ్యమును ప్రవృద్ధి చేయువాఁడా! శ్రీమన్నారాయణా

మేమున్నన్నాళ్ళును సుగుణసౌహార్ద్రంబులను మాకు కలుగ చేయుదువని 

లక్ష్మీదేవిని నీ వక్షస్థలముపై నిలిపి, మంచివారికిశ్రేయస్సును చేయించెడి 

నీవన్నచో మాకు చాలా యిష్టమే సుమా.

జైహింద్.

Print this post

2 comments:

అజ్ఞాత చెప్పారు...

మహద్భాగ్యం, మద్భాగ్యమ్మటంచెంచెదన్.
కడయింటి కృష్ణ మూర్తి

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ధన్యవాదాలు కృష్ణమూర్తిగారూ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.