జైశ్రీరామ్.
విధానము.
పై ఛందోగ్రంధమును సులభ తరము చేయుటకు 3 భాగములు
చేసితిని అవి.
1అభిజ్ఞా ఛందము.1,నండి 9,వరకు.
పట్టిక
×××××
******************************
1ఉక్త. 2అత్యుక్త. 3మధ్య. 4 ప్రతిష్ట. 5.సుప్రతిష్ట 6.గాయిత్రి
1. 4. 8. 16. 32. 64,
******************************
7.ఉష్ణిక్. 8అనుష్టుప్. 9బృహతి.
128. 256. 512.
******************************
ఉదాహరణము.
అభిజ్ఞా ఛందమందలి,అనుష్టుప్ ఛందమున
చేష్టిత నామక వృత్తము.వృత్తసంఖ్య. 35.
ప్రాసనియమము కలదు.
ర.త గగ.గణములు.
క్రొత్త వింతేరా. యనంగా
పాతరోతేరా!కనంగన్!
క్రొత్త భేషేరా!యనంగన్
పాత చైదాలేమౌ!నెంచన్!
u. i. u. u. u. i. u. u
2. 32. =34+1=35.
2అణిమా ఛందము 10.పంక్తి ఛందము నుండి20 కృతిఛందము వరకు.
=======
పట్టిక
*****
==============================
10.పంక్తి. 11.త్రిష్టుప్. 12.జగతి. 13.అతిజగతి. 14.శక్వరి
1024. 2048. 4096. 8192. 16,384.
==============================
15.అతి శక్వరి. 16.అష్టి. 17.అత్యష్టి. 18.ధృతి 19అతి ధృతి.
32,768. 65,536. 1.32,072. 2,62,144. 5,24,288.
==============================
20,కృతిఛందము.
10,48,576.
============
ఉదాహరణకు.
అత్యష్టీ ఛందము.
ధర్మ మార్గంపాదమునకు 17.అక్షరములు.ప్రాస నియమము కలదు.
10,యక్షరముతో యతి చెల్లును.వృ.సం=17499.
ఊడి గాకుల శోక భాగ్యం!ఓటు మోసం రాజకీయమ్
ఓడు చింతన లేని గర్వం!నోట మట్టే కొట్టి రాంథ్రమ్.
త్రాడు కోతయె! నిల్పు ధర్మం!తాట తీసే!న్యాయమేదీ?
జాడ గుర్తిలి కాల్చి వేయం!చాటు చోరు ల్హేయ మారున్?
త్రాడు కోత=ఉరిశిక్ష,ఆకులము=కలవరపాటు.
తెలిసికొను విధానము.
గణములు.ర.స.య.ర.త.గగ.
u. i. u. i i u. i. u. u. u. i. u. u. u. i. . u. u
2. 8. 16. 64. 1024. 16,384
3.అనిరుద్ ఛందము.
ప్రకృతి ఛందము 21. నుండి26.ఉత్కృతి ఛందము వరకు.
రసచంపకము.పాదమునకు 26 అక్షరములు ఉండును.
ప్రాసనియమము కలదు.11,19.అకుషరములతో యతి చెల్లును.
ప్రతి పాదము నందు, న.జభ.జ.జ.జ.ర.స.లగ.వృ.సం.
వృత్త సంఖ్య కనుగొను విధానము.
4805714
కరమరుదైన చోట!సుమ గంథము చిందెడు చోట!కౌముదుల్విర జిమ్ముచో!
సురవర సార సాలు మది సుందర మేర్చెడి చోట!సోమయాజుల యాగముల్!
గురుతర భావరాజి!వెఱగొందక నిల్చిన. చోట!కకోమలంబగు వేదముల్!
వర గణనీయ మౌత?గురు వందన మందుత!శోభ భ్రామణిన్!సిరి వారమై!!
. i i. i. i. u. i. u. i. i. i. u i. i u. i. i. u i
1 2 4 8 32. 128. 256. 512 2048 4096 16 384 32768.
47 . 175. 431; 943 3091 7087. 23.371
u. i. u. i. i. u. i. u
1,31,072 5,24.288. 41,94.304
5613.9. 187211. 711409
"
; **********
పై సృజనాత్మక గర్భ శ్రవంతి యందు సులభము గా వృత్త సంఖ్యను తమ ఆంథ్రామృతము నందు ప్రచురింప. ప్రార్ధనము
మొత్తము13.42.17,726.వృత్తములు
ఇట్లు.
వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.