గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, ఫిబ్రవరి 2017, మంగళవారం

నూతన ఛందములలో గర్భ కవిత 3. . . . రచన . . . శ్రీ వల్లభ,

2 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బ్రహ్మశ్రీ నాగఫణి శర్మ గారికి కొప్పరపు పురస్కారము

0 comments

జైశ్రీరామ్.

జైహింద్. 

27, ఫిబ్రవరి 2017, సోమవారం

కవయిత్రి పావులూరి సుప్రభగారు శ్రీవల్లభవఝలవారి మార్గంలో చేసిన గర్భకవిత్వము.

1 comments

జైశ్రీరామ్.
కవయిత్రి పావులూరి సుప్రభ.
శ్రీమాన్ వఝల అప్పల నరసింహమూర్తి చిత్ర కవి బంధ కవితా ప్రభావంతో మరొక కవయిత్రి చేసిన గర్భకవితామృతాస్వాదనాపరులవండి.
రక్షణీ, గతిమా, మహిత గర్భ నటకళా వృత్తము.
నటకళా వృత్తము.
అందించెడి పద్యంబది హరుసంబునుఁ గూర్చకున్న నాపద రాదా
యందంబుగ రాకుండిన నరవిందము లీయవింక నర్మిలి తోడన్‌
వందించవు నన్నెప్పుడుఁ బరమేశిగఁ బల్కుచున్నఁ బ్రత్యహమిట్లే
క్రుందించితి నన్నట్లుగఁ, గొఱఁతేదియొ చేసినట్లు కోపమె నాపై
రక్షణీ
అందించెడి పద్యంబది
యందంబుగ రాకుండిన
వందించవు నన్నెప్పుడుఁ
గ్రుందించితి నన్నట్లుగ
గతిమా
హరుసంబునుఁ గూర్చకున్న
నరవిందము లీయవింక
పరమేశిగఁ బల్కుచున్నఁ
గొఱఁతేదియొ చేసినట్లు
మహిత
అందించెడి పద్యంబది హరుసంబును గూర్చకున్న
నం(అం)దంబుగ రాకుండిన నరవిందము లీయవింక
వందించవు నన్నెప్పుడు పరమేశిగ బల్కుచున్నఁ
గ్రుం(క్రుం)దించితి నన్నట్లుగఁ, గొఱఁతేదియొ చేసినట్లు
సుప్రభ
11:45 AM
02-25-2017

వృత్తము - ఛందస్సు - గణములు - యతి/యతులు
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
నటకళా -- ఆకృతి - త,య,న,జ,జ,ర,స,గ --1,9,18
రక్షణీ -- అనుష్టుప్‌ - త,య,లల
గతిమా -- బృహతీ - స,స, జ
మహిత -- అత్యష్టీ - త,య,న,జ,జ,గల -- 9
ఈ రోజు ఉదయము చింతా రామకృష్ణరావు గారు వల్లభ వఝల అప్పల నరసింహమూర్తి గారిచే వ్రాయబడినదని రక్షణీ, గతిమా, మహిత గర్భ నటకళా వృత్తముగా నొక పద్యమును ప్రచురించారు. నడక నచ్చి,తేలికగానే యున్నట్లుందని తోచి, యత్నించాలని యనిపించినది. మనసులోని యూహను తెలిసిన వారు వెంటనే సాయమందించి తమ తలఁపులుగా వ్రాయించినది. ఈ వృత్తమును పరిచయము చేసిన చింతా వారికీ, వల్లభ వఝల వారికీ ధన్యవాదములు. అడుగకున్నా మనసెరిగి, నామీఁదనే దోషారోపణ గావించి :-) యేదో విధముగా కూర్పించిన శక్తికి కూడ వందనములు.
అద్భుతమైన స్పందనతో చక్కని గర్భకవిత వెలయించిన సుప్రభగారిని మనసారా అభినందిస్తూ, శ్రీ వల్లభవఝలవారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.
జైహింద్.

26, ఫిబ్రవరి 2017, ఆదివారం

నూతన ఛందములలో గర్భ కవిత ౨. . . . రచన . . . శ్రీ వల్లభ,

3 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

25, ఫిబ్రవరి 2017, శనివారం

నేను రచించిన నవాక్షర సమ వృత్త (నీలోత్పల) - కంద త్రయ, - మణిగణనికర(శశికళా)వృత్త - గర్భిత సరసిజ వృత్తము:

1 comments

జైశ్రీరామ్.
సరసిజ
నవాక్షర సమ వృత్త (నీలోత్పల) - కంద త్రయ, - మణిగణనికర(శశికళా)వృత్త - గర్భిత సరసిజ వృత్తము: *
[లక్షణము: మ - - - - - - - స... గణములుండును.
యతి:1-10-18 యక్షరములకు... ప్రాసపాటింపఁబడును]
భావావేశోద్భాప్రభావా! భవ నుత వర నిను వని గను దివిజుల్!
దేవీ! దుర్గా దేవత ధీవై, దివిజుగ ననుగను తిరముగ తెలియన్.
నీ వానిన్, నే నీవెగ! నీవే నివసన మొసగుమ నిరుపమ. కవితై
కావన్ వచ్చే కావలి కావా? కవిగను నిలుపుమ కరుణను భువిపై.
1. సరసిజ వృత్త గర్భిత నవాక్షరసమ (నీలోత్పల) వృత్తము : - గణములు
యతి 1- 5
భావావేశోద్భాప్రభావా
దేవీ! దుర్గా దేవత ధీవై,
నీ వానిన్, నే నీవెగ! నీవే 
కావన్ వచ్చే కావలి కావా?
2. సరసిజ వృత్త గర్భిత కందము(1)
భావావేశోద్భాప్ర
భావా! భవ నుత వర నిను వని గను దివిజుల్!
దేవీ! దుర్గా దేవత 
ధీవై, దివిజుగ ననుగను తిరముగ తెలియన్.
3. సరసిజ వృత్త గర్భిత కందము(2)
నీ వానిన్, నే నీవెగ! 
నీవే నివసన మొసగుమ నిరుపమ. కవితై
కావన్ వచ్చే కావలి 
కావా? కవిగను నిలుపుమ కరుణను భువిపై.
4. సరసిజ వృత్త గర్భిత కందము(3)
భవ నుత వర నిను వని గను 
దివిజుల్! తెరవున ననుగను తిరముగ తెలివిన్.
నివసన మొసగుమ నిరుపమ. 
కవితై ఘనతను గొలుపుమ కరుణను భువిపై.
5. సరసిజ వృత్త గర్భిత మణిగణనికర (శశికళా) వృత్తము[న---- గణములు.యతి:1-9]
భవ నుత వర నిను వని గను దివిజుల్! 
దివిజుగ ననుగను తిరముగ తెలియన్.
నివసన మొసగుమ నిరుపమ. కవితై 
కవిగను నిలుపుమ కరుణను భువిపై. 
జైహింద్.

నూతన ఛందములలో గర్భ కవిత ౧. . . . రచన . . . శ్రీ వల్లభ,

5 comments

జైశ్రీరామ్.
జైహింద్.

24, ఫిబ్రవరి 2017, శుక్రవారం

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు.

1 comments

 జైశ్రీరామ్.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా యావత్ శివస్వరూప జీవ కోటికి శుభాకాంక్షలు.
భక్తజనులకు అసాధారణ శివ కటాక్షం లభించాలని మనసారా కోరుకొంటున్నాను.
ఓం నమశ్శివాయ.


గిరిజా కల్యాణం సమయంలో పఠించు ప్రవరలు.
ఓం నమశ్శివాయ.
జైహింద్.

23, ఫిబ్రవరి 2017, గురువారం

నవాక్షర సమవృత్త, - కంద త్రయ, - మణిగణనికర(శశికళా)వృత్త - గర్భిత సరసిజ వృత్తము . . రచన. చింతా రామకృష్ణారావు.

0 comments

జైశ్రీరామ్.
సరసిజ
నవాక్షర సమవృత్త, - కంద త్రయ, - మణిగణనికర(శశికళా)వృత్త - గర్భిత సరసిజ వృత్తము: *
[లక్షణము: మ - - - - - - - స... గణములుండును.
యతి:1-10-18 యక్షరములకు... ప్రాసపాటింపఁబడును]
భావావేశోద్భాస ప్రభావా
దేవీ దుర్గా! దీపిత ధీవై
నీ వానిన్ నన్ నేర్పున నీవే
కావన్ వచ్చే భద్రవు కావా?
సరసిజ
నవాక్షర సమవృత్త, కంద త్రయ, మణిగణనికర(శశికళా)వృత్త గర్భిత సరసిజ వృత్తము: *
[లక్షణము: మ - - - - - - - స... గణములుండును.
యతి:1-10-18 యక్షరములకు... ప్రాసపాటింపఁబడును]
ప్రావీణ్యా నా రక్షక రావా భవ భయ హరణుఁడ! వర మగు భవుఁడా!
భావాతీతా! భవ్య ప్రభావా! ప్రవిమల చరితుగ వరలఁ గనుము నన్.
జీవేశా! నా చింతయు, సేవల్, శివ పద భరణము కృతికి పతివయే
దేవా నీ యందే గురుదేవా! దివిజ భరణ! హర! తెలియుము కృతిలోన్
1. సరసిజ వృత్త గర్భిత నవాక్షర వృత్తము: - గణములు. యతి 1- 5
ప్రావీణ్యా నా రక్షక రావా!
భావాతీతా! భవ్య ప్రభావా!
జీవేశా! నా చింతయు, సేవల్,
దేవా నీ యందే గురుదేవా!
2. సరసిజ వృత్త గర్భిత కందము(1)
ప్రావీణ్యా నా రక్షక  - రావా భవ భయ హరణుఁడ! వర మగు భవుఁడా!
భావాతీతా! భవ్య ప్ర - భావా! ప్రవిమల చరితుగ వరలఁ గనుము నన్.
3. సరసిజ వృత్త గర్భిత కందము(2)
జీవేశా! నా చింతయు, - సేవల్, శివ పద భరణము కృతికి పతివయే
దేవా నీ యందే గురు - దేవా! దివిజ భరణ! హర! తెలియుము కృతిలోన్.
4. సరసిజ వృత్త గర్భిత కందము(3)
భవ భయ హరణుఁడ! వర మగు - భవుఁడా! ప్రవిమల చరితుగ వరలఁ గనుము నన్.
శివ పద భరణము కృతికి ప - తివయే దివిజ భరణ! హర! తెలియుము కృతిలోన్
5. సరసిజ వృత్త గర్భిత మణిగణనికర (శశికళా) వృత్తము[న---- గణములు.యతి:1-9]
భవ భయ హరణుఁడ! వర మగు భవుఁడా!
ప్రవిమల చరితుగ వరలఁ గనుము నన్.
శివ పద భరణము కృతికి పతివయే
దివిజ భరణ! హర! తెలియుము కృతిలోన్.
జైహింద్.

చతురానన, సత్వగతి గర్భ నిస్తులస్తబక వృత్తము. . . రచన . . . శ్రీవల్లభ.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

22, ఫిబ్రవరి 2017, బుధవారం

సిరివర, చంపక, భువనవళిచంపక గర్భ చంపక భద్ర వృత్తము. . . . రచన . . . శ్రీవల్లభ.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

21, ఫిబ్రవరి 2017, మంగళవారం

మాతృభాషా దినోత్సవము సందర్భముగా అందరికీ నా శుభాకాంక్షలు.

1 comments

 జైశ్రీరామ్.

ఆర్యులారా!. నేడు ఫిబ్రవరి 21వ తేదీ. మాతృభాషా దినోత్సవము.
ఈ సందర్భముగా అందరికీ నా శుభాకాంక్షలు.
మాతృ దేవత - మాతృ భూమి - మాతృ భాష అత్యున్నత స్థాయిలో గౌరవింపబడాలి. 
అటువంటి గౌరవాన్ని మనం ఇచ్చి, మన ఔన్నత్యాన్ని ప్రకటించుకోవాలి.
మాతృ దేవి మిన్న మాతృభూమియు మిన్న 
మాతృభాష మిన్న మరువకయ్య.
మాతృ దేవిఁ గొల్చి. మాతృభూమిని నిల్చి 
మాతృభాష ఘనత మహిని నిలుపు.
శుభాకాంక్షలతో
మీ
రామకృష్ణారావు.
జైహింద్.

శ్రీవల్లభ నూతన ఛందస్సులు గర్భ కవిత. . . . శ్రీ వల్లభ,

1 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

20, ఫిబ్రవరి 2017, సోమవారం

శ్రీమద్భగవద్గీత ౧౨వ అధ్యాయము. తెలుగు సేత . . . శ్రీ వల్లభ.

1 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

19, ఫిబ్రవరి 2017, ఆదివారం

శ్రీవేంకటేశ్వర సుప్రభాతము. ౨. తెలుగు సేత . . . శ్రీ వల్లభ.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

18, ఫిబ్రవరి 2017, శనివారం

శ్రీవేంకటేశ్వర సుప్రభాతము.తెలుగు సేత . . . శ్రీ వల్లభ.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

17, ఫిబ్రవరి 2017, శుక్రవారం

స్వర్భాను - భూమిజ - త్రిభువన గర్భ భూభద్రికా వృత్తము. రచన. . . . శ్రీ వల్లభ,

1 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

16, ఫిబ్రవరి 2017, గురువారం

సూక్ష్మరామయణమ్. ౧౦౧ - ౧౧౦ / ౧౧౦. రచన. భాగవతుల రంగనాయకమ్మ.

1 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

15, ఫిబ్రవరి 2017, బుధవారం

సూక్ష్మరామయణమ్. ౯౧ - ౧౦౦ / ౧౧౦. రచన. భాగవతుల రంగనాయకమ్మ.

0 comments

 జైశ్రీరామ్.
(సశేషమ్)
జైహింద్.

14, ఫిబ్రవరి 2017, మంగళవారం

సూక్ష్మరామయణమ్. ౮౧ - ౯౦ / ౧౧౦. రచన. భాగవతుల రంగనాయకమ్మ.

1 comments

 జైశ్రీరామ్.
(సశేషమ్)
జైహింద్.

13, ఫిబ్రవరి 2017, సోమవారం

సూక్ష్మరామయణమ్. ౭౧ - ౮౦ / ౧౧౦. రచన. భాగవతుల రంగనాయకమ్మ.

0 comments

 జైశ్రీరామ్.
(సశేషమ్)
జైహింద్.

12, ఫిబ్రవరి 2017, ఆదివారం

సూక్ష్మరామయణమ్. ౬౧ - ౭౦ / ౧౧౦. రచన. భాగవతుల రంగనాయకమ్మ.

0 comments

 జైశ్రీరామ్.
(సశేషమ్)
జైహింద్.

11, ఫిబ్రవరి 2017, శనివారం

సూక్ష్మరామయణమ్. ౫౧ - ౬౦ / ౧౧౦. రచన. భాగవతుల రంగనాయకమ్మ.

0 comments

 జైశ్రీరామ్.
(సశేషమ్)
జైహింద్.

10, ఫిబ్రవరి 2017, శుక్రవారం

సూక్ష్మరామయణమ్. ౪౧ - ౦ / ౧౧౦. రచన. భాగవతుల రంగనాయకమ్మ.

0 comments

 జైశ్రీరామ్.
(సశేషమ్)
జైహింద్.

సూక్ష్మరామయణమ్. ౩౧ - ౪౦ / ౧౧౦. రచన. భాగవతుల రంగనాయకమ్మ.

1 comments

 జైశ్రీరామ్.
(సశేషమ్)
జైహింద్.

9, ఫిబ్రవరి 2017, గురువారం

సూక్ష్మరామయణమ్. ౨౧ - ౩౦ / ౧౧౦. రచన. భాగవతుల రంగనాయకమ్మ.

0 comments

 జైశ్రీరామ్.
(సశేషమ్)
జైహింద్.

8, ఫిబ్రవరి 2017, బుధవారం

సూక్ష్మరామయణమ్. ౧౧ - ౨౦ / ౧౧౦. రచన. భాగవతుల రంగనాయకమ్మ.

1 comments

 జైశ్రీరామ్.
(సశేషమ్)
జైహింద్.

7, ఫిబ్రవరి 2017, మంగళవారం

సూక్ష్మరామయణమ్. ౧ - ౧౦ / ౧౧౦. రచన. భాగవతుల రంగనాయకమ్మ.

0 comments

జైశ్రీరామ్.
(సశేషమ్)
 జైహింద్