గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, ఆగస్టు 2017, బుధవారం

అజరామరవత్ ప్రాజ్ఞో . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. అజరామరవత్ ప్రాజ్ఞో విద్యామర్థం చ సాధయేత్, 
గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్. 
క.జరయును, మరణము లేనటు
ధర విద్యా ధనములందెదరు కనఁ బ్రాజ్ఞుల్.
మరణము దరి కొనినటులుగ
చరియింతురు ధర్మములనుసరణీయమెదే.
భావము. ప్రాజ్ఞుడు తనకు ముసలితనము, మరణము లేవనే ఆలోచనతో - విద్యను, ధనాన్ని సంపాదించాలి. మృత్యువు తన జుట్టుపట్టుకొని తీసుకు పోవటానికి సిద్ధంగా ఉందనే ఆలోచనతో ధర్మాన్ని ఆచరించాలి.
జైహింద్.

22, ఆగస్టు 2017, మంగళవారం

శ్రీ మహాప్రభు శతకము. రచన. వద్దిపర్తి అప్పయామాత్యకవి. క్రీ.శ.౧౯.

0 comments

జైశ్రీరామ్.
  జైహింద్.

21, ఆగస్టు 2017, సోమవారం

ధర్మే తత్పరతా, ముఖే మధురతా, (సత్పురుష వైభవం) మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. ధర్మే తత్పరతా, ముఖే మధురతా, దానే సముత్సాహతా
మిత్రేzవంచకతా, గురౌ వినయతా, చిత్తేzతిగంభీరతా, 
ఆచారే శుచితా, గుణే రసికతా, శాస్త్రేషు విజ్ఞానతా,
రూపే సుందరతా, శివే భజనతా, సత్స్వేవ సందృశ్యతే.
ఉ.ధర్మమె రూపమౌన్ నయ సుధా పరిభాషణ, దాన శీలమున్,
మర్మము లేని మైత్రి, గురు మానిత భక్తియు, చిత్త శోభ, సత్
కర్మల శౌచమున్, సుగుణ గ్రాహ రసజ్ఞత, శాస్త్ర బోధయున్,
భర్మ శరీర శోభ,శివ భక్తి, మహాత్ముల యందు తెల్లమౌన్.
భావము. ధర్మాచరణమునందు ఆసక్తి, నోటియందు మధురభాషణము, దానము చేయుటయందు సమధికోత్సాహము, మిత్రుల యందు మోసబుద్ధి లేకుండుట,గురు జనుల పట్ల వినయము, మనస్సులో గాంభీర్యము, ఆచారాలను పాటించటంలో శుచిత్వము,సద్గుణ గ్రహణములో రసజ్ఞత, శాస్త్ర జ్ఞానము కలిగి యుండుట,రూప సౌందర్యము, పరమేశ్వర సేవ, అనే లక్షణాలు సత్పురుషులయందు మాత్రమే గోచరిస్తూ ఉంటాయి. 
జైహింద్.

20, ఆగస్టు 2017, ఆదివారం

రామాయణం యొక్క విశేషములు ఏమిటి? శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ.

0 comments

జైశ్రీరామ్.
రామాయణం యొక్క విశేషములు ఏమిటి?
శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ.
మన సంస్కృత వాఙ్మయం లో ,ఎటువంటి పెద్ద పెద్ద ఒత్తులతో కూడిన పదాలు లేకుండా ఏ కాస్త భారతీయ భాషలలో ఏ భాష తెలిసిన వారైనా సరే(ముఖ్యంగా తెలుగు వారు) కొద్దిగా ప్రయత్నం చేస్తే చదవ గలిగిన గ్రందాలు రెండు ఉన్నాయి ఒకటి భగవద్గీత రెండవది రామాయణం.
మన సంస్కృతీ గొప్పదనం ఇప్పటి వరకు నిలబడి ఉంది అంటే కారణం రామాయణ,భారతాలు. మన సమస్త వాగ్మయం కనుమరుగై పోయిన(అమంగలం ప్రతిహతమగు గాక,అటువంటిది జరుగకుండు గాక) రామాయణం ఒక్కటి ఉంటే మళ్ళీ మన సమస్త వాఙ్మయాన్ని సృష్టి చేసుకోవచ్చూ.అంత గొప్పది రామాయణం . కొన్ని సంవత్సరాల పాటు వాల్మీకి తపస్సు చేయగా ఫలితంగా రామాయణం ఆవిర్భవించింది. రామాయణం 24,000 శ్లోకాలతో కూడినది.ప్రతి 1000 శ్లోకాలకు ఒక గాయత్రీ మంత్ర బీజాక్షరం చొప్పున వాల్మీకి మహర్షి కూర్పుతో రచన చేసాడు.రామాయణం "తపస్వాధ్యాయనిరతం తపస్వి వాగ్విదాం వరం(నిరంతరం స్వాధ్యాయం,తపస్సు చేసుకుంటున్న '"అని ప్రారంభమవుతుంది అనగా జీవితంలో ప్రతి పనిని తపస్సుగా చేయమని "తప" అని ప్రారంబిoచారు.అలా చేస్తే ఏమవుతుంది అంటే రామాయణము చివరి శ్లోకం చెబుతుంది "జనశ్చ శూద్రోపి మహాత్వ మీయాత్"(దీని తర్వాత కొన్ని శ్లోకాలు ఉన్నప్పటికీ ఈ శ్లోకాన్ని చివరి శ్లోకంగా పెద్దలు నిర్ణయం చేశారు)అని మహాతత్వాన్ని పొందుతాడు. అనగా జీవితాన్ని తపస్సు లా మలుచుకుంటే వారు మహతత్వాన్ని సాధిస్తారు అని రామాయణ సందేశం.అది ఎలా సాధించాలో కూడా మనకు రామాయణం ఆదర్శం.
ఇక్కడ వచ్చే ప్రశ్న జీవితాన్ని తపస్సు గా మార్చుకోవడం ఎలా?
తపస్సు అంటే ఎదో అడవులలోకి వెళ్లి నాసాగ్రం (భ్రూమధ్యం) మీద ధ్యాస పెట్టి చేసేది కాదు. ప్రతి పని చేస్తున్నప్పుడు చేస్తున్నదప్పుడు "నేను" అనే భావం విడిచి తన కు విధించిన కర్తవ్యాన్ని, వాడు(ఈశ్వరుడు)నిర్ణయం చేసాడు,వాడి కొరకు,వాడి పనిని తన చేత చేయఁచుకుంటున్నాడు అనే భావం రావడం.ఈ భావం కుదురుకున్న వాడు ఎదో పెద్ద మార్పు (బయటి ఆడంబరాల్లో మార్పు)వాడిలో వస్తుంది అనుకోవద్దు రోజు తన పనులు ఏ విధంగా చేసుకుంటున్నాడో అలాగే చేసుకుంటాడు కానీ లోపల తన భావంలో తేడా వస్తుంది.ఉదాహరణకు రోజు భోజనం ఎలా చేస్తాడో అలాగే భోజనం చేస్తాడు కానీ మనసులో - "లోపల (కడుపులో) వైశ్వానరాగ్ని గా పరమేశ్వరుడు వున్నాడు వాడి కొరకు ,వాడు ఇచ్చిన అన్నాన్ని,వాడి ప్రసాదంగా స్వీకరిస్తున్నాను" అని భోజనమ్ చేస్తాడు.ఇలా ఏ పనైన ఆ భావంతో(పరతత్వ భావన) చేస్తాడు.అప్పుడు వాడి నడక ప్రదిక్షణం అవుతుంది వాడి నిద్ర సమాది అవుతుంది,వాడి పలుకు ఈశ్వర వాక్కు అవుతుంది.అటువంటి స్థితికి మన లౌకిక కార్యములు చెడకుండా మహతత్వం వైపు తీసుకెళ్లేదే రామాయణం.
రామాయణాన్ని 3 స్థాయిలలో అర్థం చేసుకోవలసి వుంటుంది.
1. ఆది భౌతిక కోణం
2. ఆది దైవిక కోణం
3. ఆధ్యాత్మిక కోణం
1. ఆది భౌతిక కోణం:
ఇందులో రామచంద్ర మూర్తి ని నరుడిగా భావన చేసి ,సీతమ్మని మానవ వనితగా భావన చేసి వారి హృదయం (రామ హృదయం ను,సీత హృదయం ను)ను అర్థం చేసుకొని వారిని ఆదర్శంగా తీసుకొని వాటిని జీవితానికి అన్వయం చేసుకోవడం వలన జీవితం ధర్మబద్దమవుతుంది.ప్రతి నిర్ణయానికి ముందు కాసేపు ఆగి ఈ situation రాముడికి వస్తే తాను ఏ విధంగా react అవుతాడు (రామాయణం చదువగా చదువగా రామ హృదయం అర్థమైన తర్వాత ఈ స్థితి వస్తుంది)అని ప్రశ్న వేసుకొని ఆ విధంగా చేస్తే మనం ఏ శాస్త్రములు చదువకున్నా మన జీవితం ధర్మ బద్దం చేయబడుతుంది.
రాముడు తండ్రి దగ్గర పుత్రునిగా ఎలా వున్నాడు,తమ్ముడి దగ్గర అన్నగా ఎలా తప్పులను సరిదిద్ధి ధర్మ మార్గంలో తమ్ముళ్లను ప్రవేశ పెట్టాడు,స్నేహితుడికి కష్టం వస్తే తనకే వచ్చినట్టుగా ఎలా ఏడ్చాడు తన స్నేహితుని కష్టం తీర్చడానికి ఏ విధంగా ప్రయత్నించాడు,శరణు అన్నా వారిని ఎలా రక్షించాడు,ఏ విధంగా ఇతరుల పై ప్రేమ చూపించే వాడు అనే అనేక విషయములు రాముని నుండి నేర్చుకోవచ్చు.అందుకే పెద్దలు చెప్తారు"రామాత్ వర్తితవ్యం న రావణాత్(రాముని వలే ప్రవర్తించవలెను రావణుని వలె కాదు)"అని.
స్త్రీ పతివ్రత ధర్మాలు సీతమ్మ నేర్పిస్తుంది.
ఇవే గాక,
1.ఒక అధికారికి గాని,అధికారికి సలహాలు ఇచ్ఛే వారికి గానిస్వార్థపూరిత ఆలోచన వస్తే దేశం ఎలా ఏడుస్తుందో రామాయణం చూపిస్తుంది.కైకేయి తన కుమారుడు రాజు కావాలన్న స్వార్థపు ఆలోచన ముగ్గురిని వితంతువులను చేసింది,నలుగురు కుమారులకు తండ్రి లేకుండా చేసింది,దేశానికి రాజు లేకుండా చేసింది అంతే కాదు ఎవరి కోసం రాజ్యం ఆడిగిందో ఆ భరతుడు 14 సంవత్సరాల పాటు నరక యాతన అనుభవించాడు.కాబట్టీ ఒక రాజకీయ నాయకుడికి స్వార్థం ఉంటే దేశం ఎలా ఏడుస్తుందో చూపిస్తుంది రామాయణం.
2. త్యాగంతో జీవితాన్ని గడిపితే("తేన త్యక్తే న భుంజీత" )చరిత్రలో ఏ విదంగా చరిత్రలో నిలిచి పోతారో చూపిస్తుంది రామాయణం. (రామాయణం మొదట రాజ్య త్యాగం,రామాయణం చివర దారా పరిత్యాగం)
రామాయణంలో ముగ్గురు అన్న తమ్ముళ్లు కనిపిస్తారు రామలక్ష్మణ భరతశత్రఘ్నులు,వాలిసుగ్రీవ,రావణ కుంభకర్ణ విభిషేణులు. రాజ్యం తనకు వచ్చిన స్వీకరించడానికి ఏడ్చి భాదపడిన వాడు ఒకడు, అన్న ను చంపి రాజ్యం తీసుకున్న వాడు ఒకడు, రాజ్యం తనకు రాదని తెలిసి అన్న శత్రువుల వైపు వెళ్లి అన్నను చంపించాడు ఒకడు ఎవరు నిలిచిపోయారు చరిత్రలో?
3. ధార్మిక జీవితాన్ని ఎలాగడపాలో నేర్పిస్తాడు రాముడు "రామో విగ్రహవాన్ ధర్మ:"అని.
2. ఆది దైవిక కోణం:
ఇందులో రాముణ్ణి శ్రీ మహా విష్ణువుగా,సీతమ్మని శ్రీ మహా లక్ష్మి గా భావన చేసి రామాయణాన్ని చదువుతారు.
ఇలా చదివితే రామాయణం ఇంకొక కోణం లో అర్థం అవుతుంది.రాముడు తాను నరుడనే చెప్పుకుంటాడు కానీ ఎవరూ ఆయనను నరుడు అనుకున్నట్టు కనిపించదు.లక్ష్మణుడు ,భరతుడు,విశ్వామిత్రుడు,వశిష్ఠుడు,సుమిత్ర,తార,మండోదరి,మారీచుడు,జటాయువు,హనుమ ,గుహ స్వామి ఇలా ఎందరో రాముని గురించి మాట్లాడినప్పుడు రాముడు నరుడు అన్న భావనతో వారు మాట్లాడలేదు.విశ్వామిత్రుడు అంటాడు "అహం వేద్మిమహాత్మానం రామం దశరాత్మజాం వశిష్టోపీ మహా తేజ ఏ తే మె తపసి స్థితాః"అంటాడు రాముడు ఎవరో నాకు తెలుసు వశిష్ఠుడికి తెలుసు,తపస్సులందరికి తెలుసు అంటాడు.లక్ష్మణుడు ఈశ్వరభక్తి లో ఈశ్వరుని విడిచి పెడితే బ్రతక లేనటువంటి దాస్య భక్తి ని చూపిస్తాడు,స్నేహ భక్తి ని సుగ్రీవుడు, శరణాగతి ని విభీషణుడు,భగవత్ భక్త సేవను శత్రజ్ఞుడు ,శబరి గురు భక్తిని,తపస్సు చేసి ఋషులు ఏతత్ ఫలం రామార్పణం అని వారి తపస్సును రామునికి ఇస్తారు ఇలా ప్రతి ఒక్క పాత్రకు రామాయణం లో రాముని తో ప్రత్యక్ష అనుబంధం.
3. ఆధ్యాత్మిక కోణం:
ఇందులో రాముణ్ణి ఆత్మ గా,సీతమ్మని జీవునిగా భావన చేసి రామాయణాన్ని చదువుతారు.
మొదట జీవుడు పరమాత్మ తో కలిసే ఉంటాడు(గురువు(విశ్వామిత్రుడు)వచ్చి జీవుడిని పరమాత్మ ను కలుపుతారు (సీతారామ కళ్యాణము))తరువాత జీవుడు గుణములకు(సత్వ రజో తమో) లొంగి, విషయ వాంఛల(బంగారు లేడి)కు లోనై పరమాత్మ(రాయుడు) తో వియోగం పొందుతారు . జీవుడిని తీసుకొని వెళ్ళేది మనస్సు(రావణుడు) అప్పుడు జీవుడు మనస్సు కు లొంగకుండా తపస్సు చేస్తే మళ్ళీ పరమాత్మ తో సంయోగం లభిస్తుంది. అని జీవుడిని ఉద్ధరించుకోవాదానికి సాధన రహస్యాల చాలా చెబుతుంది. నేను కథ నంత ఒక దగ్గర పెట్టి overall గా చెప్పాను కానీ ఒక్కొక్క కాండలో సాధన రహస్యాలు ఎన్నో చెప్పబడ్డాయి.
ఉదాహరణకు బాలకాండ తీసుకోండి
ఇందులో
రాముడు-ధర్మమ్
లక్ష్మణుడ-అర్థం
భరతుడు-కామ
శత్రజ్ఞుడు- మోక్షం
మాములుగా వయస్సు ప్రకారం చెప్పాలి అంటే రామ భరత లక్ష్మణ శత్రజ్ఞులు అని చెప్పాలి కానీ మనం రామలక్షమన,భరత శత్రజ్ఞులు అని చెప్తాం ఎందుకంటే అర్థం ఎప్పుడు ధార్మికంగా ఉండాలి,కామం ఎప్పుడు మోక్షం వైపే ఉండాలి అనే విషయాన్ని తెలియచేయడానికి.
ఇలా ఆలోచన చేస్తే మూడు కోణాలతో ఆలోచన చేస్తే రామాయణం గొప్పదనం ఎంతో తెలుస్తుంది.
రామాయణం లో ఉన్న 24వేల శ్లోకాలలో దాదాపుగా 15వేల శ్లోకాలకు పైగా ఈ 3 రకాల అర్థాలను చెప్పవచ్చూ అలా పుస్తకాలు రాసిన మహా పురుషుల వున్నారు.
ఇవే కాక రామాయణం లో గోప్ప గణిత శాస్త్రం ఉంది దానిని రెమెళ్ళ అవదానులు గారు వారి వైదిక గణిత లో వివరించారు.
ఖగోళ శాస్త్రం గురించి సుగ్రీవుడు సీతమ్మను వెతికే సమయంలో చెప్తాడు,సైకాలజీ, తత్వ శాస్త్రం,మేనేజ్మెంట్ .ఇలా అనేక విషయాల సమాహారం రామాయణం.
సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలంకుంటున్న ప్రతి వారి ఇంట ఉండవలసిన గ్రంధం రామాయణం, చడవవలసిన గ్రంధం రామాయణం, ఆచరించవలసిన గ్రంధం రామాయణం
శ్రీ Satyanarayana Choppakatla వారికి ధన్యవాదములు.
జైహింద్.

19, ఆగస్టు 2017, శనివారం

నలువ చెలువ యందము ! శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారి వివరణము.

0 comments

  జైశ్రీరామ్.
నలువ చెలువ యందము !
శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారి వివరణము.
మ: నవలావణ్య రసాలయంబు , గుణరత్న స్థాన , మాస్య క్షపా
ధవ బింబోదయ , మున్నతస్తన గిరీంద్రవ్యక్తి , వాచాసుధా
భవ దేశంబు , వళీతరంగము , తనూభద్ర ప్రభా ఫేన దీ
ప్తి విలాసం , బగు తత్కళత్రము సుధాబ్ధిం బోలి సద్భక్తితోన్;
శ్రీ కాళ హస్తీశ్వర మాహాత్మ్యము 2 ఆ: 5- పద్యం: ధూర్జటి.

కథాసందర్భంగా ద్వతీయా శ్వాసంలో ఈపద్యం చోటుచేసికొన్నది. బ్రహ్మ గారికి తనభార్య సరస్వతి పాల్కడలివలె దర్శన మిచ్చిందట!
అర్ధములు: లావణ్యము- శరీరపు మెఱపు,; రసాలయం - నీటితోనిండినది సముద్రము; గుణరత్నములు- సద్గుణములనేరత్నములు; ఆస్యము -ముఖము; క్షపాధవ బింబోదయము- చంద్రబింబముయొక్కఉదయము; గీరీంద్రవ్యక్తి- పర్వతములు కనబడుట; వాచాసుధ- అమృతమువంటిమాటలు; భవదేశము-పుట్టుచోటు; వళీతరంగము- పొట్టపై ముడతలనే కెరటములు; తనూభద్ర ప్రభాదీప్తి ఫేన దీప్తి విలాసము- శరీరకాంతి యనే నురుగులు; కళత్రము- భార్య ; సుథాబ్ధి-పాలకడలి;
సరస్వతిని కవి పాల సముద్రంతో పోల్చి చెపుతున్నాడుకవి. ఇదో అపురూపమైన పద్యం! భార్యను పాలకడలితో పోల్చిచెప్పిన కవులెవ్వరూ కానరారు. సముద్రముతో పోల్చినప్పుడు దానిలక్షణాలు భార్యయందు ఉండాలికదా? ఉన్నాయని రూపకంలో నిరూపిస్తున్నాడు.
పాల సముద్రంయొక్క లక్షణాలు ఈవిధంగా ఉన్నాయి. అపారమైన నీరు, రత్నములకు నెలవగుట , చంద్రుని పుట్టుక , పెద్దపర్వతములు కానవచ్చుట, అమృత ము ఉదయించుట, కెరటములు , నురుగులు స్థూలముగానిదీదానిస్వరూపము. ఆలక్ణణములన్నియు కళత్ర స్థానమున నున్న సరస్వతి యందుకూడ నున్నవట! యెట్లు?
నవలావణ్యమనే నీరు సమృధ్ధిగా నీమె శరీరమున నున్నదట. గుణములనే రత్నములున్నవట.( ఆమెసద్గుణములు రత్నములవంటివే యని ) ముఖమే చంద్రోదయముతో సమానమట. ఆమె సమున్నతమైన స్తన సంపదయే పర్వతములట, ఆమెమాటలే అందుదుదయించిన యమృతమట! (ఆమెమాటలు అమృతతుల్యములని చెప్పుట) ఆమె యుదరస్థమైన ముడుతలే కెరటములట, ఆమె శరీర కాంతియే నురుగట. ఈవిధముగా పాల సముద్రము వలె సరస్వతి యట కరుదెంచి భర్త బ్రహ్మగారికి కనువిందుచేసింది.
భార్యను పాల సముద్రముతో పోల్చుట యెంత గొప్పయూహ! ఎంతఉదాత్తమైనది!
సద్గుణగణములుగల భార్య పాల సముద్రము వంటిదే! పాల సముద్రము దేవతలకు అమృతానిచ్చింది. భార్య కూడా ఆనందామృతాన్ని జీవితాతం భర్తకు అందిస్తూనే ఉంటుంది.పాలసముద్రం కల్పవృక్షాదుల నిచ్చింది. వాటి ఉపయోగం?కోరికలుదీరటం. భార్యకూడా కల్పవృక్షమే నీకోరికల నన్నిటినీ తీరుస్తూనే ఉంటుంది. ఉదాత్తమైన భావనతో భార్యను భర్త
గౌరవిస్తూ ఉంటే భార్య గృహ లక్ష్మియై సకల భోగ భాగ్యాలకు కారక మౌతుంది. పాలసముద్రం మనప్రక్కనున్నా గమనించలేని ధూర్తులకు జీవనం వ్యధాభరితమే! భార్యతో అనురాగాన్ని పంచుకుంటే ఆజీవితం సుధాభరితమే!* అనే చక్కని సందేశాన్ని యీపద్యంద్వారామనకు అందజేసిన ధూర్జటి కవీనాంకవి యనుటలో నత్యుక్తి లేదు.
స్వస్తి!
శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారికి ధన్యవాదములు.
జైహింద్.

18, ఆగస్టు 2017, శుక్రవారం

నూతన ఛందములలో గర్భ కవిత 111. . . . రచన . . . శ్రీ వల్లభ

0 comments

జైశ్రీరామ్.
భేదినీ.శివాయన.గర్భ తరతమ వృత్తము.
రచన.వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
తరతమ వృత్తము
మీమా పరభేదమెంచక మితిమీరి జేసిపాపము మేలొనర శివా యనన్
కామాతుర స్వార్ధచింత.గతిగాన నెంచకీభువి కాలమువశమౌనొకో
క్షేమంబును పొందనేరక చితిజేరువాంఛ లేలను శీలముసరిగావలె
రామాయనవేమి మూర్ఖత రతనాలసీమ నుండియురాలెడుతలపేలరా. 
1.మీమాపరభేదమెంచక 
కామాతుర స్వార్ధచింత
క్షేమంబునుబొంద నేరక
రామాయనవేమి మూర్ఖత.
2.మితిమీరి జేసి పాపము
గతి గాన నెంచకీభువి
చితిజేరు వాంఛ లేలను
రతనాలసీమనుండియు.
3.మేలొనర శివాయనన్
కాలమువశమౌనొకో
శీలము సరిగావలెన్
రాలెడు తలపేలరా.
4.మీమా పరభేదమెంచక మితిమీరి జేసి పాపము
కామాతుర స్వార్ధచింత గతిగాన నెంచకీ భువి
క్షేమంబును పొంద నేరక చితిజేరు వాంఛ లేలను
రామాయనవేమి మూర్ఖత రతనాలసీమనుండియు.
5.మితిమీరి జేసిపాపము మేలొనర శివాయనన్
గతిగాన నెంచకీ భువి కాలమువశమౌనొకో
చితిజేరు వాంఛ లేలను శీలము సరి గావలెన్
రతనాలసీమనుండియు  రాలెడు తలపేలరా.
6.మితిమీరి జేసి పాపము. మీమాపర భేద మెంచక
గతిగాన నెంచకీభువి కామాతుర స్వార్ధ చింతన
చితిజేరు వాంఛ లేలను క్షేమంబును బొందనేరక
రతనాలసీమనుండియు రామాయనవేమి మూర్ఖత.
7.మితిమీరిజేసి పాపము మీమాపర భేదమెంచక మేలొనర శివాయనన్
గతిగాన నెంచకీభువి కామాతుర స్వార్ధ చింతన కాలమువశమౌనొకో
చితిజేరు వాంఛ లేలను క్షేమంబును బొంద నేరక శీలము సరిగావలెన్
రతనాలసీమనుండియు రామాయనవేమి మూర్ఖత రాలెడుతలపేలరా.
8మితిమీరి జేసిపాపము మేలొనర శివాయనం మీమాపరభేదమెంచక
గతిగాననెంచకీభువి కాలమువశమౌనొకో కామాతుర స్వార్ధచింతన
చితిజేరువాంఛలేలను శీలము సరిగావలెం క్షేమంబునుబొందనేరక
రతనాలసీమనుండియు రాలెడు తలపేలరా  రతనాలసీమనుండియు.
9.మేలొనర శివా యనన్ మీమా పర భేధమెంచక
కాలమువశమౌనొకో కామాతుర స్వార్ధ చింతన
శీలము సరిగావలెన్ క్షేమంబును బొందనేరక
రాలెడు తలపేలరా రతనాలసీమనుండియు.
10.
మేలొనర శివాయనన్ మీమాపరభేదమెంచక మితిమీరి జేసి పాపము
కాలమువశమౌనొకో కామాతుర స్వార్ధ చింతన గతిగాననెంచకీభువి
శీలముసరిగావలెన్ క్షేమంబునుబొందనేరక చితిజేరువాంఛలేలను
రాలెడుతలపేలరా రామాయనవేమి మూర్ఖత రతనాలసీమనుండియు.
తరతమ.ఉత్కృతి.త.జ.భ.స.జ.భ.భ.య.లగ.యతులు 10.19.
1తేజశ్విననీ బృహతీ.త.జ.భ.వృ.సం.429.
2.కందళీ.బృహతీ.వృ.సం.428.
4.నాపరా.ధృతి.త.జ.భ.స.జ.భ.యతి.10.
5.అతిశయ.అత్యష్టీ త.జ.భ.భ.స.లగ.యతి.10.
6.వివేచనా.ధృతి.త.జ.భ.భ.జ.త.యతి 10.
7.భేదక.ఉత్కృతి.త.జ.భ.త.జ.భ.భ.స.లగ.యతులు.10.19.
8.మేలిమి.ఉత్కృతి.త.జ.భ.భ.స.య.భ.భ.లల.యతులు.10.18.
9.భేదనీ.అత్యష్టీ. భ.స.య.భ.ర.లలయతి 9.
10.శివాయన ఉత్కృతి.భ.స.య.భ.ర.న.జ.ర.లల.యతులు.నుండియు.
జైహింద్..

17, ఆగస్టు 2017, గురువారం

నూతన ఛందములలో గర్భ కవిత 110. . . . రచన . . . శ్రీ వల్లభ

0 comments

 జైశ్రీరామ్.
వీడని.గర్భస్వేచ్ఛా శృంఖలవృత్తము
రచన.వల్లభవఝల అప్పల నరసింహమూర్తి.జుత్తాడ.
స్వేచ్ఛా శృంఖల వృత్తము.
పరపాలన వీడెగాని పరభాష వీడదాయెను పాపమదేమో పరమా
వరదంబులు లేనెలేవు పరమోహమేల మానవ ప్రాపకమాయెంపెరలున్
చిరకీర్తిని కోరవేల స్థిరమెంచుమాతృభాషను శ్రీపరమంచెంచు మదిన్
తిరమేదిల నీతియందు తెరవెంచినిల్పుస్వేచ్ఛను ద్వీపముసౌఖ్యంబలరన్.
1.పరపాలనవీడెగాని
వరదంబులులేనెలేవు
చిరకీర్తినికోరవేల
తిరమేదిలనీతియందు.
2.పరభాష వీడదాయెను
పరమోహమేల మానవ
స్థిరమెంచు మాతృభాషను
తెరవెంచి నిల్పు స్వేచ్ఛను.
3.పాపమదేమో పరమా
ప్రాపకమాయెంపెరలున్
శ్రీపరమంచెంచుమదిన్
ద్వీపము సౌఖ్యంబలరన్.
4.పరపాలన వీడెగాని పరభాష వీడదాయెన్
వరదంబులు లేనెలేవు పరమోహమేలమానవ
చిరకీర్తినికోరవేల  స్థిరమెంచు మాతృభాషను
తిరమేదిల నీతియందు తెరవెంచినిల్పు స్వేచ్ఛను.
5.పరభాష వీడదాయెను పాపమదేమోపరమా
పరమోహమేల మానవ ప్రాపకమాయెం పెరలున్
స్థిరమెంచుమాతృభాషను స్శ్రీవేచ్పఛారమంచెంచు 
తెరవెంచి నిల్పు స్వేచ్ఛను ద్వీపము సౌఖ్యంబలరన్.
6.పరభాషవీడదాయెనుపపాపమదేమోపరమా పరపాలనవీడెగాని
పరమోహమేలమానవ ప్రాపకమాయెం పెరలుం వరదంబులులేనెలేవు
స్థిరమెంచు మాతృభాషనుశ్రీపరమంచెంచుమదిం చిరకీర్తిని కోరవేల
తెరవెంచినిల్పు స్వేచ్ఛద్వీపముసౌఖ్యంబలరలరం తిరమేదిలనీతియందు.
7.పరభాషవీడదాయెను పరపాలనవీడెగాని. 
పరమోహమేలమానవ వరదంబులు లేనెలేవు
స్థిరమెంచుమాతృభాషను చిరకీర్తినికోరవేల
తెరవెంచి నిల్పు స్వేచ్ఛను తిరమేదిలనీతియందు.
8.పరభాషవీడదాయెను పరపాలనవీడెగాని పాపమదేమోపరమా.
పరమోహమేలమానవ వరదంబులులేనెలేవు ప్రాపకమాయెంపెరలున్
స్థిరమెంచుమాతృభాషను చిరకీర్తి కోరవదేల శ్రీపరమంచెంచుమదిన్
తెరవెంచి నిల్పు స్వేచ్ఛను తిరమేదిల నీతియందు ద్వీపము సౌఖ్యంబలరన్.
9.పాపమదేమోపరమా పరపాలనవీడెగాని 
ప్రాపకమాయెంపెరలుం వరదంబులులేనెలేవు
శ్రీపరమంచెంచుమదిం చిరకీర్తినికోరవేల
ద్వీపము సౌఖ్యంబలరం తిరమేదిల నీతియందు.
10
పాపమదేమోపరమా పరపాలనవీడెగాని పరభాషవీడదాయెను
ప్రాపకమాయెం పెరలుం వరదంబులులేనెలేవు  పరమోహమేలమానవ
శ్రీపరమంచెంచుమదిం చిరకీర్తినికోరవేల స్థిరమెంచుమాతృభాషను
ద్వీపముసౌఖ్యంబలరం తిరమేదిలనీతియందు తెరవెంచినిల్పు స్వేచ్ఛను.
స్వేచ్ఛా శృంఖలవృత్తము .ఉత్కృతి.స.స.జ.స.జ.భ.భ.త.లగ.యతులు
10.19
1.గతిమా బృహతీ.స.స.జ.వృ.సం.348.
2.కందళీ.బృహతీ.స.జ.భ.వృ.సం.428.
3.మాణవకము.అనుష్టుప్.భ.త.లగ.వృ.సం.103.
4.శాసని.ధృతి.స.స.జ.స.జ.భ.యతి10.
5.పరదా.అత్యష్టీ.స.జ.భ.భ.త.లగ.యతి.10.
6.పరతా.ఉత్కృతి.స.జ.భ.భ.త.జ.జ.జ.గల.యతులు.10.18.
7.మాదక.ధృతి.స.జ.భ.స.స.జ..యతి.10.
8..పాపనా.ఉత్కృతి.స.జ.భ.స.స.జ.భ.త.లగ.యతులు.10.19.
9.ప్రమదా.అత్యష్టీ.భ.త.జ.జ.జ.గల.యతి.9
10.వీడని.ఉత్కృతి.భ.త.జ.జ.భ.జ.ర.లల.యతులు.9.18.
జైహింద్.

16, ఆగస్టు 2017, బుధవారం

చతుర్వేదాలు . . . శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారి వివరణ.

1 comments

 జైశ్రీరామ్.
చతుర్వేదాలు
ఎవరయినా వేదం నేర్చుకునేవారు చేయాలంటే మొత్తం వేదరాశిని అధ్యయనము చేయాల్సిందే.
వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిసి ఒకే ఒక వేదరాశిగా ఉండేది.
కృతయుగం నుండి ద్వాపరయుగం వచ్చేసరికి వేదరాశిని అధ్యయనము చేయవలెనంటే బహుకష్టమని ఎక్కువ మంది అంతగా ఉత్సాహము చూపించే వారు కాదు.
మొదట కలగలుపుగా ఉన్న వేదరాశి(వేదాలను)ని వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం విభజించాడు.
ఈ వేదరాశిని వ్యాసుడు ఋక్కులు అన్నింటిని ఋక్సంహితగాను, యజస్సులు అన్నింటిని యజుస్సంహితగాను, సామలన్నింటినీ సామసంహితగాను విడదీసి అలాగే అథర్వమంత్రాలన్నీ ఒకచోట చేర్చి అథర్వసంహితగా విభజన చేసాడు.
అలా నాలుగు వేదాలు మనకు లభించాయి.
1. ఋగ్వేదము
2. యజుర్వేదము
3. సామవేదము
4. అధర్వణవేదము
1. ఋగ్వేదము :
ఋగ్వేదః శ్వేత వర్ణస్యాత్ ద్విభుజో రాసబాననః |
అక్షమాలాదరః సౌమ్యః ప్రీతో వ్యాఖ్యా కృతో ద్యమః ||
ఋగ్వేదము తొలుత క్రీ.పూ. 1700 ప్రాంతములో ఉచ్చరించబడింది. ఋగ్వేదాన్ని దర్శించినప్పుడు ఆ వేదాన్ని ఒక రూపుతో దర్శించారు కనుక ఋగ్వేద పురుష అని వ్యవహరిస్తారు.
ఋగ్వేద పురుషుడు తెలుపు రంగులో ఉంటాడట. గాడిద ముఖం కలిగి ఉంటాడట. చేతిలో మాల ధరించి ఉంటాడట. ప్రశాంతంగా కనిపిస్తూ వేదాన్ని అందించాడట. సంహితలు ఎనిమిది ఆష్టకములుగా ఉంటుంది. ఒక్కో అష్టకం ఎనిమిది అధ్యాయాలుగా ఉంటుంది. మొత్తం 1028 సూక్తులుగా ఉంటుంది. 10552 ఋక్కులు(మంత్రాలు) ఉంటాయి. మొత్తం 397265 అక్షరాలు ఉంటాయి. ఈ మొత్తం 21 శాఖలుగా విభజించారు.
సంహితలని ఆ శిష్యుల పేర్ల రూపుతో వ్యాస, పైల, ఇంద్రప్రమాతి, మాండుకేయ, సత్య స్రవస్, సత్య హిత మరియూ సత్యశ్రీగా విభజించారు. ఒక్క సత్యశ్రీ శాఖను తీసుకుంటే అది వారి శిష్యులైన సాఖల, సాఖపూణి మరియూ భాష్కల అని మూడుగా విభాగం అయ్యింది. సాఖల మరో ఐదు భాగాలుగా, భాష్కల నాలుగు భాగాలుగా విభాగం అయ్యింది.
ఋగ్వేదంలో ఉపవేదంగా ఆయుర్వేదం ఉంటుంది. బ్రాహ్మణాలు నాలుగు భాగాలుగా, అవి పైంగ, బహ్-వ్రిచ, ఆశ్వలాయణ, గాలవ బ్రాహ్మణాలుగా విభాగం అయ్యాయి. ఆరణ్యకాలలో ఉపనిషత్తులు ఉంటాయి. అవి నిర్వాణ, ఐతరేయ, బహ్-వ్రిచ, సౌభాగ్య, కౌశీతకి, ముద్గల, నాదబిందు, త్రిపుర, ఆత్మ ప్రభోద మరియూ అక్షరమాలిక అని పది ఉపనిషత్తులుగా ఉంటాయి.
2. యజుర్వేదము :
అజస్యపీత వర్ణస్యాత్ యజుర్వేదో అక్షసూత్ర ద్రుత్ |
వామే కులిశపాణిస్తూ భూతిదో మంగళప్రదః ||
మేక ముఖం కలిగి పసుపు రంగులో ఉంటాడు. ఎడమ చేతిలో కర్ర పట్టుకొని ఉంటాడు. సంపదలని, శుభముని ఇచ్చేలా ఉంటాడు. యజుర్వేద పురుషుడిని ఇలా దర్శించారు.
యజుర్వేదం రెండు భాగాలు ఉంటుంది.
౧. శుక్ల యజుర్వేదం
౨. కృష్ణ యజుర్వేదం.
శుక్ల యజుర్వేదం కాణ్వ మరియూ మాద్యందిన అనే శాఖలుగా ఉంటుంది. కృష్ణ యజుర్వేదం తైత్తిరీయ, మైత్రాయణి, కఠ మరియూ కపిస్తల అనే శాఖలుగా ఉంటుంది.
కాణ్వశాఖ 40 అధ్యాయాలు, 328 అనువాకాలు, 2086 మంత్రాలుగా ఉంటుంది. మాద్యందిన 40 అధ్యాయాలు, 303 అనువాకాలు, 1975 మంత్ర ఖండాలు, 3988 మంత్రాలు, 29626 పదాలు, 88875 అక్షరాలుగా ఉంటుంది. ఇంత లెక్కతో జాగ్రత్తగా బద్రపరిచారు. తైత్తిరీయ శాఖ 7 ఖాండాలు, 44 ప్రపాతకాలు, 635 అనువాకాలుగా ఉంటుంది. మైత్రాయణి శాఖ 4 ఖాండాలు, 54 ప్రపాతకాలు, 2144 మంత్రాలుగా ఉంటుంది. కఠ శాఖ 5 ఖాండాలు, 40 ఆధ్యాయాలు, 13 అనువాచకాలు, 843 అనువాకాలు మరియూ 3091 మంత్రాలుగా ఉంటుంది. బ్రహ్మణాలు చరక, కాతక, తుంబుర, జాబల, కన్కతి, స్వేతాస్వేతర, మైత్రాయణి, ఖాందికేయ, హారిద్ర, ఆహ్వరాక, ఔకేయ మరియూ చాగలేయ అనే శాఖలుగా ఉంటుంది. శుక్ల యజుర్వేద ఉపనిషత్తులు ఈసావాస్య, బృహదారణ్యక, జాబాల, సుభాల మొదలైనవి. కృష్ణ యజుర్వేద ఉపనిషత్తులు కఠ, తైత్తిరీయ, స్వేతాస్వేతర మొదలైనవి.
3. సామవేదము :
నీలోత్పలధళశ్యామోః సామవేదో హయాననః |
అక్షమాలాఅన్వితోదక్షే వామే కుంభదారణ స్మృతః ||
కృష్ణుడి వంటి నీలి రంగులో, గుఱ్ఱపు ముఖం కలిగి, ఒక చేతిలో కొరడా కలిగి, ఎడమ చేతిలో కుండ కలిగి ఉంటాడు. సామ వేద పురుషుడిని ఇలా దర్శించారు.
సామవేదం మొత్తం 1065 శాఖలుగా ఉంటుంది. అందులో ముఖ్యమైనవి తొమ్మిది. రాణాయణ, సాట్యాయన, సార్యముగ్ర, కల్వల, మహా కల్వల, లాంగల, కౌతుమీయ, గౌతమీయ, జైమినీయ అని ముఖ్య శాఖలు. అందులో రాణాయణ,కౌతుమీయ మరియూ జైమినీయ అనేవి మాత్రం ఉన్నాయి. మిగతా శాఖలు లభించడం లేదు.
సామవేద సంహితలు పూర్వర్చిక, ఉత్తరార్చిక మరియూ ఆరణ్యకాలుగా ఉంటుంది. పూర్వర్చిక 6 ప్రాతకాలు, 59 దషతీలు, 585 మంత్రాలుగా ఉంటుంది. ఉత్తరార్చిక 9 ప్రాతకాలు, 120 దషతీలు, 1220 మంత్రాలుగా ఉంటుంది. ఆరణ్యకాలు 55 మంత్రాలుగా ఉంటుంది.
బ్రాహ్మణాలు భాల్లవి, కాలబవి, రౌరుకి, సాట్యాయన అని నాలుగు భాగాలుగా ఉంటుంది.
ఉపనిషత్తులు ఛాందోగ్య, కేన, మైత్రాయణి, తల్వకారీయ మరియూ మహోపనిషత్తులుగా ఉంది.
4. అధర్వణవేదము:
ఆధర్వణాభిదో వేదో ధవళో మర్కటాననః |
అక్షమాలాన్వితో వామే దక్షే కుంభదరః స్మృతః ||
తెలుపు రంగులో, కోతి ముఖం కలిగి, కుడి చేతిలో మాల ధరించి, కుడిచేతిలో కుండ కలిగి ఉంటాడు. ఆదర్వణ వేద పురుషుడిని ఇలా దర్శించారు.ఆదర్వణ వేదం 15 శాఖలు, 20 ఖం
స్వస్తి !
శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారికి ధన్యవాదములు.
జైహింద్.

15, ఆగస్టు 2017, మంగళవారం

వందే మాతరమ్. భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

2 comments

 జైశ్రీరామ్.
 వందే మాతరమ్.
ఆర్యులారా! నేడు మన భారతాంబకు పరపాలనా శృంఖలా విముక్తి లభించిన పరమ పవిత్రమైన రోజు. ఈ స్వాతంత్ర్య దినోత్సవము సందర్భముగా యావన్మంది భారతీయులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియఁ జేసుకొంటున్నాను.
మహనీయులైన మన పూర్వీకుల ధన మాన ప్రాణ త్యాగ ఫలంగా అతి కష్టంమీద సాధించినదీ స్వాతంత్ర్యము. మనకు లభించిన ఈ స్వాతమ్త్ర్యాన్ని మనం ఎంతో పవిత్రంగా భావించి దీనిని నిలుపుకొనుచు, మనము స్వేచ్ఛగా జీవించుచు మన భావి తరములవారికి ఈ స్వేచ్ఛా భారతిని స్వచ్ఛమైన భారతిని సుసంపన్న భారతిగా తీర్చి దిద్ది,అందించ వలసిన బాధ్యత మనపై యున్నందున ప్రతీ భారతీయుఁడు తమ విధినిర్వహనలో అప్రమత్తంగా ఉంటూ, ప్రపంచంలో భారతీయులు సగర్వంగా జీవించే సన్మార్గాలను నిర్మించాలి.నేను సహితం అంటూ ప్రతీ ఒక్కరు దేశభక్తితో అభివృద్ధిపథమున గమింతురని మనసారా నమ్ముతూ, వేడుకొనుచున్నాను.
జైభారతమాతా!
జైహింద్.

14, ఆగస్టు 2017, సోమవారం

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

1 comments

 జైశ్రీరామ్.
అగణితమైన యీ జగతికాధ్యుఁడు, వర్ధకుఁ డంతకుండునై
సుగుణములందునొప్పుచు, విశుద్ధ గుణాఢ్యుల చిత్తవర్తియై,
ప్రగణితుఁడైన కృష్ణుని యపార కృపామృతమీకు కల్గుతన్
సుగుణ విశాల సద్హృదయసుందరులార! కనుండు కృష్ణునిన్.
పుట్టితి నేను మీ మదిని. పుట్టితి మిమ్ములనుద్ధరింపగా,
నెట్టి దురంత దుస్థితులవేవిధి వచ్చిన నేను కాచెదన్.
గట్టిగ నన్ను నమ్మెడి ప్రగాఢ మహాద్భుత భక్తియుక్తులన్.
కట్టెదుటన్ మెలంగుచును కానగరానని, లేననందురా?

వరలెడి భక్తితోఁ గనఁగ ప్రార్థన చేసెడి వారి ప్రక్కనే
వరలుచు నుందు నేను. వరభావ సమృద్ధుల దేహ వర్తినై.
నిరుప సాధనాపటిమ నిర్మల చిత్తము కల్గు వారిలో
వరగుణరూపినై మెలగి వర్ధిల చేతును వారినిద్ధత్రన్.

పాపమడంతు నేను. గుణ భాసురులన్ గరుణించి కాతు. ని
క్షేపము నేను మౌనులకు. శ్రీకర భారత భూమి నెన్నడున్
శ్రీపతినై సతంబు నివసింతు, జనావళి కోర్కెలన్నిటిన్
నా పనిగా తలంచుచు ననంత శుభంబుల తోడ గూర్చెదన్.
శుభమస్తు.

విన్నారుగా ఆశ్రీకృష్ణుఁడు మీకు దర్శనమిచ్చి ఏమి చెప్పాడో.
చేసుకొన్నవారికి చేసుకొన్నంత పుణ్యం మహదేవా!
అన్యధా శరణం నాస్తి ఐ శరణాగతులైనవారికి మన నల్లనయ్య దయ ఎప్పుడూ లభిస్తుందండి.
మరొక్కమారు మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలండి.
జైహింద్.

నూతన ఛందములలో గర్భ కవిత 109. . . . రచన . . . శ్రీ వల్లభ

0 comments

జైశ్రీరామ్.
కందళీ. సాహస.మాణవకదురితమా.నేతెంచు..దయాళు.రమ్మా
సార్ధక .నెలవొదవి వీడకుమా..గర్భశివాగమనవృత్తము. 
రచన.వల్లభవఝల అప్పలనరసింహమూర్తి. జుత్తాడ.
శివాగమనవృత్తము.
గుడివీడి యేడకేగితి కు వలయులుగారువీరు కూరిమిరమ్మావడిగా.
విడవోని భక్తిగొల్తును వివరితగుణగణ్యులయ్య పేరగుమల్లేశహరా
పొడగాంచనైతి నిద్రలొ భువనములనుజూచిరమ్ము పోరరుసంస్కారమునన్
నిడుపుండ్రమల్లికార్జున నివసితముకు లోటులేదు నేరుగ రమ్మాశుభగా.
1.గుడివీడి యేడకేగితి
విడవోనిభక్తిగొల్తును
పొడగాంచనైతి నిద్రలొ
నిడుపుండ్ర మల్లికార్జున.
2.కు  వలయులుగారువీరు
 వివరితగుణగణ్యులయ్య
భువనములను చూచిరమ్ము
నివసితముకు లోటులేదు.
3.కూరిమిరమ్మావడిగా
పేరగు మల్లేశ హరా
పోరరు సంస్కారమునన్
నేరుగ రమ్మా శుభగా.
4.గుడివీడి యేడ కేగితి కు  వలయులు గారువీరు
విడవోనిభక్తి గొల్తును వివరితగుణగణ్యులయ్య
పొడగాంచనైతినిద్రలొ భువనములను జూచిరమ్ము
నిడుపుండ్ర మల్లికార్జున నివసితముకు లోటులేదు.
5.కు  వలయులుగారువీరుకకూరిమి రమ్మావడిగా
వివరితగుణగణ్యులయ్య పేరగుమల్లేశ హరా
భువనములను చూచిరమ్ము  పోరరు సంస్కారమునన్
నివసితముకు లోటులేదు నేరుగ రమ్మా శుభగా.
6.కూరిమిరమ్మా వడిగా గుడివీడియేడకేగితి
పేరగుమల్లేశ హరా విడవోనిభక్తిగొల్తును
పోరరుసంస్కారమునన్పొడగాంచనైతి నిద్రలొ
నేరుగరమ్మాశుభగా నిడుపుండ్ర మల్లికార్జున.
7.కూరిమిరమ్మా వడిగా గుడివీడి యేడకేగితి కు  వలయులుగారువీరు
పేరగుమల్లేశ హరావిడవోనిభక్తిగొల్తును వివరితగుణగణ్యు లయ్య
పోరరు సంస్కారమునన్ పొడగాంచనైతి నిద్రలొ భువనములను చూచిరమ్ము
నేరుగరమ్మాశుభగా నిడుపుండ్ర మల్లికార్జున నివసితముకు లోటులేదు
8.కు  వలయులు గారువీరు గుడివీడి యేడకేగితి
వివరిత గుణగణ్యులయ్య విడవోని భక్తిగొల్తున్
భువనములను చూచిరమ్ము పొడగాంచనైతి నిద్రలొ
నివసితముకు లోటులేదు నిడుపుండ్ర మల్లికార్జున.
9కువలయులుగారువీరు గుడివీడియేడకేగితికూరిమిరమ్మావడిగా
వివరిత గుణగణ్యులయ్య విడవోనిభక్తిగొల్తును పేరగు మల్లేశహరా
భువనములనుజూచిరమ్ము పొడగాంచనైతినిద్రలొ పోరరుసంస్కారమునన్
నివసితముకులోటులేదు నిడుపుండ్ర మల్లికార్జున నేరుగరమ్మాశుభగా.
10.
కువలయులుగారువీరు కూరిమిరమ్మావడిగా గుడివీడియేడకేగితి
వివరితగుణగణ్యులయ్య పేరగు మల్లేశహరా విడవోనిభక్తిగొల్తును
భువనములను జూచిరమ్ము పోరరుసంస్కారమునన్ పొడగాంచనైతి నిద్రలొ.
నివసితముకులోటులేదు నేరుగరమ్మా శుభగా నిడుపుండ్ర మల్లికార్జున.
శివాగమన ఉత్కృతి స..జ.భ.న.స.జ.భ.తలగ.యతులు.10.19.
1కందళీ.బృహతీ స.జ.భ.వృ.సం.428.
2.సాహస.బృహతీ వృ.సం.352.
3.మాణవక అనుష్టుప్.భ.త.లగ.వృ.సం.103
4.దురితమా ధృతి స.జ.జ.న.స.జ.యతి .10.
5.నేతెంచు అత్యష్టీ న.స.జ.భ.త.లగ.యతి 10.
6.దయాళు అత్యష్టీ భ.త.జ.జ.ర.లల.యతి.9.
7రమ్మా ఉత్కృతి భ.త.జ.జ.ర.న.న.జ.గల.యతులు 9.18.
8.సార్ధక ధృతి న.స.జ.స.జ.భ.యతి 10.
9నెలవొదవి ఉత్కృతి న.స.జ.స.జ.భ.భ.త.లగ.యతులు.10.19.
10.వీడకుమా ఉత్కృతి న.స.జ.భ.త.జ.జ.ర.లల.యతులు 10.18.
జైహింద్.

13, ఆగస్టు 2017, ఆదివారం

సామాజిక పద్య సుధా స్రవంతి. తే.13-8-2017. 2pm.

1 comments

  జైశ్రీరామ్
జైహింద్.

నూతన ఛందములలో గర్భ కవిత 108. . . . రచన . . . శ్రీ వల్లభ

1 comments

  జైశ్రీరామ్.
నిరుపమా..గర్భవరగతివృత్తము
రచన.వల్లభవఝల అప్పలనరసింహమూర్తి.జుత్తాడ. 
వరగతివృత్తము.నేయముజేయుమినీతిని నీమంబునుమీరకెపుడు నిరుపంబదియౌ.
కాయముబాయుటతధ్యము కామంబునువీడవలెను కరముంశుభమౌ
ధ్యేయముధర్మమునొప్పగ ధీమంతుడవీవెయగుదు తిరుగేగనకన్
శ్రీయమనిల్చునునిత్యముశ్రీమంతమదేనరునకుస్థిరకీర్తునకున్
1.నేయముజేయుమి నీతిని
కాయముబాయుట తధ్యము
ధ్యేయము ధర్మము నొప్పగ
శ్రీయమ నిల్చును నిత్యము
2.నీమంబును మీరకెపుడు
కామంబునువీడవలెను
ధీమంతుడ వీవెయగుదు
శ్రీమంతమదేనరునకు.
3.నిరుపంబదియౌ
కరముం శుభమౌ
తిరుగేగనకన్.
స్థిరకీర్తునకున్..
4.నేయముజేయుమినీతిని నీమంబును మీరకెపుడు
కాయముబాయుట తధ్యము కామంబునువీడవలెను
ధ్యేయముధర్మమునొప్పగ ధీమంతుడవీవెయగుదు
శ్రీయమ నిల్చునునిత్యము శ్రీమంతమదేనరునకు.
5.నీమంబునుమీరకెపుడు నిరుపంబదియౌ
కామంబునువీడవలెను కరముంశుభమౌ
ధీమంతుడవీవెయగుదు తిరుగేగనకన్
శ్రీమంతమదేనరునకుసి్థిరకీర్తునకున్.
6.నిరుపంబదియౌ నేయముజేయుమినీతిని
కరముంశుభమౌ కాయముబాయుటతధ్యము
తిరుగేకనకం ధ్యేయముధర్మమునొప్పగ
స్థిరకీర్తునకుం శ్రీయమనిల్చునునిత్యము.
7.నిరుపంబదియౌ నేయముజేయుమినీతిని నీమంబుం మీరకెపుడు
కరముంశుభమౌ కాయముబాయుట తధ్యము కామంబుంవీడవలెను
తిరుగేకనకం ధ్యేయముధర్మమునొప్పగ ధీమంతుడవీవెయగుదు
స్థిరకీర్తునకుం శ్రీయమ నిల్చును నిత్యము శ్రీమంతమదేనరునకు.
8.నీమంబునుమీరకెపుడు నిరుపంబదియౌ నేయముజేయుమినీతిని
కామంబునువీడవలెనుకరముంశుభమౌ కాయముబాయుటతధ్యము
ధీమంతుడవీవెయగుదు తిరుగేగనకం ధ్యేయముధర్మమునొప్పగ
శ్రీమంతమదౌనరునకు స్థిరకీర్తునకుం శ్రీయమనిల్చునునిత్యము.
9.నీమంబునుమీరకెపుడు నేయము జేయుమినీతిని నిరుపంబదియౌ
కామంబునువీడవలెను  కాయమునిరుపంబదియౌ కరముంశుభమౌ
ధీమంతుడవీవెయగుదు ధ్యేయము ధర్మమునొప్పగ తిరుగేగనకన్
శ్రీమంతమదేనరునకు శ్రీయమనిల్చుతిరుగేగనకన్స్థిరకీర్తునకున్.గ

వరగతి.సంకృతి.భ.భ.భ.త.జ.న.స.స.యతులు.10.19.
నిదర్శన  .బృహతీ భ.భ.భ.వృ.సం.439
2.పూర్ణేందు బృహతీ .త.జ.న.వృ.సం.493.
3.సద్వర .గాయిత్రి .స.స.వృ.సం.28.
4.భంగిమధధృతి.భ.భ.భ.త.జ.న.యతి.10.
5.నీమక.అతిశక్వరీ ..త.జ.న.స.స.యతి.10.
6.శుభాద్రి అతిశక్వరి.స.స.భ.భ.భ.యతి.7.
7.నీమావళి.సంకృతి స.స.భ.భ.భ.త.జ.న.యతులు 7.16.
8.చెలిమిల.సంకృతి.త.జ.న.స.స.భ.భ.భ.యతులు10.16.
9.నిరుపమా.సంకృతి.యతులు 10.19..
జైహింద్.

12, ఆగస్టు 2017, శనివారం

శంకర శతకము. రచన. శ్రీ మాడుగుల నాగ గురునాథ శర్మ.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! భక్త జన శుభంకరుఁడగు శంకరుని ఏరీతిగా మనసునందుంచినా ఆ దయామయుని అనంత ప్రేమామృతం మనకు లభిస్తుంది. అట్టి శంకరుని బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ గారు "ఈశా భక్త కల్పద్రుమా" అనే మకుటంతో ప్రత్యక్షం చెసుకోగా, వారి ప్రేరణతో మన నాగ గురునాథ సర్మ "శంకరా" అని ఎంతగానో పులకరించిపోతూ ఆ శంకరుని పలకరించి, దానిని మకుటంగా చేసుకొని, ఆ పరమశివునిపై శతకం వ్రాసి శివానురాగానికి పాత్రుఁడగుట, మనందరికీ ముదావహము. 
ఈ శతకమును పఠించిన మహనీయులలో బ్రహ్మశ్రీ డా.మాడుగుల నాగఫణిశర్మ, బ్రహ్మశ్రీ అనంతకృష్ణ, డా. మాడుగుల అనిల్ కుమార్, వారి అమూల్యమైన అభిప్రాయాలతో శతకమునందలి అమృతాన్ని మనకురుచిచూపించారు. మీరు అవి చదివి, శతకము చదివిన తరువాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా వ్యాఖ్య రూపంలో పంపండి. కవికి మరిన్ని సద్రచనలు చేయుటము మీ ప్రోత్సాహాన్ని అందిమ్చండి.
మీకు ఆ పరమశివుని దయ లభించునుగాక.

శతక రచయిత శ్రీ మాడుగుల నాగ గురునాథ శర్మ