గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, సెప్టెంబర్ 2023, శుక్రవారం

అన్నా కేశవ! మాధవా! నృహరి .... శ్రీమన్నారాయణ శతకము .5వ పద్యము. రచన చింతా రామ కృష్ణారావు. గానం శ్రీమతి దోర్బల బాల సుజాత.

 జైశ్రీరామ్.

5. శా. ఎన్నం జాలుదె? దేవ! నీదు పద సంస్పృశ్యంబు నా చిత్తమం

దెన్నెన్నో మహిమల్ కనం బరచునే! దృష్టాంతముల్ పెక్కులో

కన్నా! నా కనులారఁ జూచుటకు నేఁ గాంక్షించుదున్. నీవె శ్రీ

మన్నారాయణ! నీదు పాద వరపద్మమ్ముల్ కనం జేయుమా.

భావము.

దేవా! శ్రీమన్నారాయణా! నీ పాద స్పర్శను కనీసము నేను మనసున ఊహించుటకైనను

సరిపోదునా? కన్నతండ్రీ! ఎన్నెన్నో మహిమలను నీ పాదములు కనఁబరిచెననుటకు పెక్కు

ఉదాహరణలు కలవు. అట్టి నీ పాద పద్మములను నా కనులారా చూడవలెనని నేను కోరుకొందును.

నీవే నీ పాద పద్మములు నాకు చూచునట్లుగా చేయుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.