జైశ్రీరామ్.
84. ఓం పుణ్యాత్మనే నమః.
లతా వృత్త గర్భ సీసము.
అసమాన తేజ నృహరివి నీవే నిజ - ము దెలుపుమా. మాదు మదిని కలవొ?
ఆత్మలన్ సతము సహజముగా నీ స్మర - ణ కలుగనీ! మా కనన్యసాధ్య!
ఉపమాన రహిత! యిహపర మీవే హృద - య విలసితా! సంశయంబు లేదు.
ధర నిల్పితీవె. యహరహము నిన్నర - సి కొలిచెదన్ హరీ! ప్రకటితముగ.
గీ. లలిత సుకుమార వర కృతి లతకుఁ జూడ - కర్తవీవౌదు *పుణ్యాత్మ*! ఘనత నీది.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
84వ సీస గర్భస్థ లత. (న య న న గ .. యతి 7)
నృహరివి నీవే నిజము దెలుపుమా. - సహజముగా నీ స్మరణ కలుగనీ!.
యిహపర మీవే హృదయ విలసితా! - అహరహమున్నిన్నరసి కొలిచెదన్.
భావము. భక్తులను పోషించువాఁడా!
భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత
జనమున ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! సాటిలేని కాంతివంతుఁడవయిన నృహరివి నీవే
కదా? మా హృదయములందు నీవు కలవా? నిజము తెలుపుము. ఓ అనన్య సాధ్యా! మా ఆత్మలందు సహజముగనే నీ
స్మరణమును కలిగించుము. సాటి లేనివాఁడా! హృదయములందు విలసిల్లువాఁడా! ఇహపరములందు నీవే కలవు.
సందేహమే లేదు.. భూమిని నిలిపెడివాడవు నీవే,. నిన్నెల్లవేళలా కొలిచెదను. ఓ పుణ్యాత్మా! లలితసుకుమారమయిన ఈ
కృతికర్తవు నీవే సుమా, నేను నిమిత్తమాత్రుడనే. ఈ ఘనత నీదే సుమా.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.