గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 101వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

101. అంగీకరించెద ననంగున్ జయింపకనె సంగీత రూపిణి నినున్ 

మాంగళ్యదాయినిగ బంగారు రూపిణిగ పొంగార గాంచమనుచున్.

బంగారు తల్లివి యనంగున్ జయించెద శుభాంగీ భవత్కృపనిలన్,

బెంగల్ తొలంగగ ననుం గాంచు మెల్లెడ భృంగార తేజమ! సతీ!

భావము.

ఓ స్వర్ణప్రకాశమా! సతీమాతా! కామమును జయించకుండా 

ఉండినచో సంగీత రూపిణివయిన నిన్ను మంగళములు ప్రసాదించు 

తల్లివిగా, బంగారమువలె ప్రకాశించు మాతగా, మనసున పొంగిపోవుచు 

చూడలేమని నేను అంగీకరించుదునమ్మా. ఓ శుభాంగీ! నీవు నా బంగారు 

తల్లివి. నీ కృపచే భూమిపై నేను అనంగుని జయించుదునమ్మా. నేను బెంగలు 

విడిచివేయునట్టుల చూచుచు అంతటా నన్ను కాపాడుచుండుమమ్మా. 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.