గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 100వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

100. భ్రాంతిన్ శివా శతకమంతా పఠించు గుణవంతుల్ శుభంకరులుగా

చింతించి నీకృపను సాంతంబు పొందునటు పంతంబుతో నిలుపుమా.

అంతా శివానుభవ కాంతిన్ మనంబులను కొంతైన చూడఁ గనుమా,

శాంతస్వభావమిడి భ్రాంతుల్ మదిన్ దుడిచి సాంతంబుఁ గావుము సతీ!

భావము.

ఓ సతీ మాతా! చదువవలెననెడి భ్రాంతితో ఈ శివా శతకమును అంతయూ 

చదివెడి గుణవంతులు శుభములను కలుగజేయువారేనమ్మా.  నీవు బాగుగా 

ఆలోచించి పట్టుదలతో వారిని నీ కృపకు పాత్రులగునట్లు 

నిలుపుమమ్మా.  అంతయూ శివునకు సంబంధించిన కాంతినే నా మనసులో 

కొంతైనా చూడనిమ్ము. నాకు శాంత స్వభావమును యిచ్చి,  నాలోని 

భ్రాంతులను మనసు నుండి పూర్తిగా తుడిచివేసి, తుదివరకు నన్ను 

కాపాడుమమ్మా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.