గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, సెప్టెంబర్ 2023, మంగళవారం

గణపవరపు వేంకటకవి రచించిన ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసమున గల ఒక భాషాశ్లేష పద్యము.

 జైశ్రీరామ్.

గణపవరపు వేంకటకవి రచించిన 
ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసమున గల ఒక
భాషాశ్లేష పద్యము.
   కం. మేలా! నాయక! బలిరా!
         ఏరా? చలమూన గాన దేరాశివల
         న్నీలాగీతీరగునా?
         వేలము దయ కావగదర! వేంకటరమణా!!

ఇది తెలుగు కందపద్యమని మనకు అర్థమగును.
ఇందు శ్లేషగా రచించబడిన  సంస్కృత పద్యమును కవి విరచించుట విశేషము.

సంస్కృతార్థములో 

మేలానాయక - మా+ఇలా-మేలా- మా-లక్ష్మికీ,ఇలా-భూమికీ,నాయకా-నాయకుడైనవాడా!, బలిరా, బలి-బలి
చక్రవర్తినుండి,రా- (దానం)గ్రహించినవాడా!,
ఏలాచలమానగా, ఏలా-ఏలకీ తీగలచేత,అచల-నిశ్చల మైన,మ-కాంతియే,అ-భూషణంగా కలిగిన, నదేరాలివలత్,
నద-నదం యొక్క,ఇరా-జలంయొక్క,ఆలి-సమూహ మందు,వలత్-సంచరించేవాడా!,నీలాగీతరగు,నీలా-నీలా
దేవియొక్క,గీతి-గానాన్ని,ఇర-ప్రేరేచినట్టి,గు-వాక్కు కలవాడా!,నావేలముదయ,నా-జ్ఞానంచేత,అవేల-అధిక మైన,ముత్-సంతోషం కలవాళ్లకు,అయ-శుభావహమైన
విధికలవాడా!,కావగదర,క-బ్రహ్మయొక్క,అవ-రక్షణను,
గ-పొందిన,దర-శంఖంఖలవాడా!,వేంకటరమణ-వేంకటేశ!
అ-విష్ణూ !
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.