గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, సెప్టెంబర్ 2023, మంగళవారం

శ్రీ వసంతతిలక సూర్యశతకము 101 నుండి 108 వరకు... రచన చింతా రామకృష్ణారావు.... గానం శ్రీమతి సిశీలాదేవి.బీ.

 జైశ్రీరామ్.

101. కన్నార నీ ద్యుతిని గాంచఁగ లేడొకండున్.  

హృన్నేత్రమొప్పు కన దృష్టిని పెట్టి చూడన్.

పన్నిద్దరంచు కని భక్తులు పల్కు నిన్నున్. 

మన్నించి కావుము సమస్తము సూర్యదేవా!

 

102. ప్రార్థింతు నిన్ సుకవి పాళిని కావుమంచున్. 

స్వార్థంబుఁ బాపగను, వర్థిలఁ జేయ మంచిన్.

సార్ధక్యమున్ గొలుప సద్వర జన్మకెమ్మిన్. 

మూర్ధన్యవర్తివయి ప్రోచెడి సూర్యదేవా!

 

103.  దాసోZZహమంచు గుణధాములు నీకు తెల్పన్

నీ సాటి లేరు కరుణించెడివారలుర్విన్.

భాసింపఁ జేయుమయ భక్తులనంశుమంతా! -

నీ సద్గుణంబు ప్రగణించెద సూర్యదేవా! 


104. కర్తవ్యమున్ దెలిపి గౌరవ వర్తనానన్

గుర్తించి మెల్గునటు కోరుచు చేయుమా. మో

హార్తిన్ దొలంగగ మహాత్మ యొనర్పుమీవే. 

ఆర్తాళిగాచెడినహర్పతి సూర్యదేవా!

 

105.  దైవత్వమబ్బు కన దక్షుఁడ! నిన్నునెమ్మిన్. 

శ్రీవక్షుసాక్షిగ వసించెడి కర్మ సాక్షీ!

మావాడివౌచునిక మా మది వెల్గరాదా? -

నీవే మహాత్మ! కరుణింతువు సూర్యదేవా!

 

106. చింతాన్వయుండనయ. శ్రీకర! రామకృష్ణన్. -

భ్రాంతిన్ రచించితిది పాఠకపాళి కోరన్.

సాంతంబు దీనిని భృశంబు పఠించువారిన్ -

స్వాంతంబునన్ గనుమ చల్లగ, సూర్యదేవా!

 

107. జ్ఞానాగ్ని దగ్ధ నిజ కర్ములఁ జేయు మమ్మున్

ప్రాణప్రదంబయిన భక్తిని కొల్పు మాకున్.

నీ నామ సంస్మరణనే విడనీక, మాలో 

ప్రాణంబుగానిలుము రక్షక సూయదేవా!

 

108. మాంగళ్య నామ  కొనుమా  జయ మంగళంబుల్

మాంగళ్య రూప! శుభ మార్గ చరా! శుభంబుల్.

మాంగళ్య తేజ! గుణ మాన్యుఁడ! మంగళంబుల్ 

మాంగళ్య మూర్తివయ మంగళ సూర్య దేవా

స్వస్తి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.