గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 93వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

93. సృష్టించి లోకములు సృష్టించి బంధనలు కష్టంబులేలనిడితో.

కష్టంబులే కనని సృష్టిన్ సృజించుటను కష్టంబులే కనముగా.

సృష్టించునీవె కని కష్టంబులే కనని సృష్టిన్ సృజించుమికపై.

సృష్టిన్ శుభాస్పదగ సృష్టింప నీకగును. సృష్టించు మమ్మరొ సతీ!

భావము.

ఓ సతీ మాతా! లోకములను సృష్టించి, మాకు పరస్పర అనురాగ బంధములు  

కలుగజేసి, కష్టములనెందుకు కలుగజేసితివమ్మా? చూచుకు కష్టములే 

లేనటువంటి సృష్టిని సృజించుటవలన కష్టములను మేము చూడముకదా. 

ఈ సృష్టిని చేయు నీవే ఆలోచిచించి చూచికష్టములు లేనటువంటి సృష్టిని 

యికపై సృజించుమమ్మా.ఈ సృష్టి శుభములకు ఆలవాలముగా సృష్టించుట 

నీకు సాధ్యమగునమ్మా. కావున సృష్టించుము తల్లీ!

జైహింద్

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.