జైశ్రీరామ్.
92. రామాభిరామవుగ శ్రీమాతరో సుగుణమే మాతగాఁ దలతుమే.
మామానసంబులను నీమంబుతో సుగుణమై మేలు కూర్చ నిలుమా.
యేమాత్రమున్ దురితమే మమ్ము చేరనటు క్షేమంకరీ! కనఁగదే.
నీ మానసంబునను మేమున్న చాలు నిక. క్షేమంబె మాకిల సతీ!
భావము.
ఓ సతీ మాతా! స్త్రీలలో అందమయినదానిగాను, మంచిగుణమే నీ
రూపముగాను మేము నిన్ను భావింతుము మా మనసులలో
సుగుణస్వరూపమువై మేలు కలిగించుట కొఱకు నిలిచియుండుమమ్మా. ఓ
క్షేమమును కలిగించు తల్లీ! చెడు అనునది మా మనసులలోనికి ఏమాత్రమూ
కూడా చేరకుండా ఉండునట్లు చూడకూడదా తల్లీ? నీ మనస్సులో మేమున్న
చాలును తల్లీ! మాకెల్లప్పుడూ క్షేమమే కలుగునమ్మా.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.