జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము
.(అష్టోత్తర శత ద్విత్వ నకార
ఏక ప్రాస శార్దూలావళి)
రచన. చింతా రామకృష్ణారావు.
1. శా. శ్రీన్నీవక్షమునందు నిల్పి, సుజన శ్రేయంబుఁ జేకూర్చు నీ
వన్నన్ మాకుఁ బ్ర మోదమే. సుగుణ సౌహార్ద్రంబులన్ మాకు మే
మున్నన్నాళ్ళునుఁ దక్కఁ జేయుదువు, దీనోద్ధారకా! దేవ! శ్రీ
మన్నారాయణ!
సత్య సన్నుత గుణా!
మద్భాగ్య సంవర్ధనా!
భావము.
దీనోద్ధారకా! ఓ దేవాది దేవా! సత్యము కారణముగా సన్నుతింప బడెడి
గుణములు కలవాడా! నాభాగ్యమును ప్రవృద్ధి చేయువాఁడా! శ్రీమన్నారాయణా!
మేమున్నన్నాళ్ళును సుగుణసౌహార్ద్రంబులను మాకు కలుగ చేయుదువని
లక్ష్మీదేవిని నీ వక్షస్థలముపై నిలిపి, మంచివారికిశ్రేయస్సును చేయించెడి
నీవన్నచో మాకు చాలా యిష్టమే సుమా.
జైహింద్.
Print this post
2 comments:
మహద్భాగ్యం, మద్భాగ్యమ్మటంచెంచెదన్.
కడయింటి కృష్ణ మూర్తి
ధన్యవాదాలు కృష్ణమూర్తిగారూ!
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.