గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, ఆగస్టు 2024, సోమవారం

దేహీతి వచనం కష్టం. .. మేలిమిబంగారం మన సంస్కృతి.

  జైశ్రీరామ్.

శ్లో.  దేహీతి వచనం కష్టం -  నాస్తీతి వచనంతథా

దేహీనాస్తీతి మద్వాక్యం - నాభూత్ జన్మనిజన్మని.

తే.గీ. కష్టమగు దేహి యనుటయు కష్టమిలను

నాస్తియనుటయు కనఁగ నో నలిననయన!

దేవ! వలదయ్య నాస్తియున్ దేహియు నిల

జన్మజన్మలకున్ నాకు, సరసిజాక్ష!

భావము. ఓ దేవా! దేహి అని నోటితో ఇతరుల అడుగుకొనుచు పలుకుటయు, 

అడిగినవారితో నాస్తి యని పలుకుటయు చాలా కష్టముగ ననిపించుచున్నది. 

జన్మజన్మలకు నాకు ఈ పదములు సంభవించకూడదని ప్రార్థించుచున్నాను.

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.