గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 86 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

చంపొరపడి నీ సపత్ని తలపున్ బ్రకటించియు మిన్నకున్న, నీ

చరణముతోడ తన్నితివి శంభుని, యందేలధ్వానమేర్పడన్,

మురియుచునున్న శంకరునిముంచుచు ప్రేమను కిల్కిలధ్వనుల్

సరసన కాముడొప్పె గుణసంస్తుత! శాంభవి! నీవెఱుంగవా? 86

భావము .
తల్లీ! పొరపాటుగా నీదగ్గర సవతి పేరు జెప్పి తరువాత ఏమీ చేయటానికి తోచక వెలవెలబాటుచే లొంగిన భర్తను , నీ చరణకమంలంతో నుదుట తాడనం జరుపగా గాంచి శివుడికి శత్రువైన మన్మధుడు ( ఇలాగైనా తనపగ తీరేట్లు శాస్తి జరిగిందని ) నీ కాలి అందెల మ్రోతలచేత కిలకిలారావాన్ని గావించారు.. ... 

అమ్మా, పొరపాటున సవతిపేరు పలికి తరువాత కిమ్మనక కూర్చోవటము. అందువలన శివుని పాదపద్మముతో ఫాలభాగము తన్నెను.   
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.