గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, ఆగస్టు 2024, బుధవారం

వజ్రాదపి కఠోరాణి .. మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్

శ్లో.  వజ్రాదపి కఠోరాణి  -  మృదూని కుసుమాదపి౹

లోకోత్తరాణాం చేతాంసి  -  కోహి విజ్ఞాతు మర్హతి౹౹

తే.గీ.  కఠిన మైనది వజ్రము కన్నఁ జూడ,

మృదులమైనది విరికన్న పృథివిఁ ఘనుల

చిత్త, మరయఁగా లేరెవ్వ రెత్తరియును,

గౌరవాత్ములనెన్నుచు గౌరవించు.

భావము.  వజ్రముల కంటెను కఠినమైనవి ,పుష్పముల కంటెను కోమలమైనవి 

లోకోత్తరులైన మహనీయుల హృదయాలను ఎవరు తెలుసుకోగలరు అనగా 

తెలుసుకోలేరని భావము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.