గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 27 || రత్నాదేవి . .. పద్యానువాదం చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

తే.గీనా క్రియాకల్పముల్ చూడ నాదు జపము,

నాదు ముద్రలున్ గమనమున్ నయనిధాన!

నీకు నా ప్రదక్షిణలగు! నేను నీకు

నిచ్చునట్టి హవిస్సులౌ నిచటి భుక్తి,

నావిలాసంబులవియెల్ల నతులు నీకు. 27.

భావము.

ఆత్మార్పణ-దృష్టితో నేను నీకు చేయు జపము నా సమస్తమైన క్రియాకల్పములు, నా ముద్రలు, నా గమనములునేను చేయు ప్రదక్షిణలుభోజనాదులు, నీకు సమర్పించు హవిస్సులుప్రణామములు, సాష్టాంగ నమస్కారములు, సుఖకరమైన నా విలాసములు, అన్నీ నీ సేవలే, నీ పూజలే.  

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.