గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, ఆగస్టు 2024, సోమవారం

పురాఽజనాభనామ్నాయం. .. మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.🙏🏻

శ్లో. పురాఽజనాభనామ్నాయం - మహాన్ దేశః సువిశ్రుతః।

భరతైః పాలితః పశ్చా - ద్భవద్భారతాభిదః॥

(కౌండిన్యస్మృతిః)

తే.గీ.  పూర్వ మజనాభ పేరుతో పుడమినున్న

పుణ్యభూమి, భరతుఁడను పుణ్యమూర్తి

పాలనము చేసినందునన్ భారతాఖ్య

దేశమయ్యెను మనదైన దేశమాత.

భావము. గొప్పదైన ఈ దేశం పూర్వం అజనాభము అనే పేరుతో ప్రసిద్ధమై

యుండేది. దీనిని భరతవంశీయులు పాలించడం చేత కాలాంతరంలో 

దీనికి భారతదేశం అను పేరు ప్రసిద్ధిలోనికి వచ్చినది.

జైహింద్.  

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.