గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి -25 || రత్నాదేవి. .. పద్యానువాదం చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

నీదు గుణత్రయంబె వరణీయ త్రిమూర్తులు, కావునన్ సతీ!

నీదరి నిల్చి మ్రొక్కిన, గణింతురు వారలు వారికన్నటుల్,

మోదముతోడ నిన్నుఁ గని పూజ్యముగా మది నిల్పి గొల్తురే,

నీ దయ కల్గినన్ గలుగు నీ పద పంకజ సేవ మాకిలన్. 25

భావము.

మాతా! తల్లీ! అమ్మా! శివానీ! త్రిమూర్తులు నీ త్రిగుణాలవలన జనించిన వారే కదా. కావున నీ చరణాలకు మేము చేసే పూజే వారికి కూడా చేసే పూజ అవుతుంది. వారికి ఇంక వేరే పూజలు అవసరము లేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఎల్లప్పుడూ నీ పాదాలను వహిస్తున్న నవరత్న ఖచ్చిత పీఠానికి దగ్గరగా చేరి, చేతులు తమ మణిమయ శిరోమకుటాలకు తాకేటట్లు పెట్టుకొని నీకు మొక్కుతూ వుంటారు. సర్వకాల సర్వావస్థలలో నీ ఆజ్ఞను శిరసావహిస్తుంటారు. కాబట్టి ఆతల్లి పాదసేవ ఆమె కటాక్షిస్తేనే మనకు దక్కేది అని దీని అంతరార్థము.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.