గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 33 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

స్మర బీజంబును, యోని బీజమును, శ్రీ మాతృప్రభా బీజమున్,

వరలన్ నీదగు నామమంత్రములకున్ ప్రారంభమున్ నిల్పుచున్

వరచింతామణితావళాంచితులు సద్భావుల్ శివాగ్నిన్ నినున్

బరమానందము తోడఁ జేయుదురు సద్భావంబుతో హోమమున్, 33

భావము.
నిత్యస్వరూపిణీ! నీ మంత్రానికి ముందు కామరాజబీజం , భువనేశ్వరీ బీజం,
లక్ష్మీ బీజం, ( మూడింటి ఐం హ్రీం శ్రీం ) కలిపి నిరవధిక మహాభోగరసికులు సకల సిరులను వాంఛిస్తూ , చింతామణులనే రత్నాలతో కూర్పబడిన అక్షమాలలను చేతుల్లో ధరించి , కామధేనువుయొక్క నేతి ధారలతో శివాగ్నిలో అనేక ఆహుతులర్పిస్తూ , హోమం చేస్తూ నిన్ను సేవించుచున్నారు

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.