గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, ఆగస్టు 2024, సోమవారం

సాధవో యాదృశా లోకే. .. మేలిమిబంగారం మన సంస్కృతి.

 ఓం శ్రీమాత్రే నమః.🙏🏻


శ్లో.  సాధవో యాదృశా లోకే - సాగరాశ్చ న తాదృశాః |

సాధవో యాంతి మర్యాదాం - యుగాంతేఽపి న సాగరాః ||

(వ్యాస సుభాషితం)

తే.గీ.  సాధువులవోలెనుండవు సాగరములు,

ప్రళయమందైన లోకాన కలతపడుచు

హద్దుమీరరు సాధువుల్, హద్దుమీరు

సాగరంబులు లోకాన శ్రీగణేశ!

భావము.  ఈ ప్రపంచములో సాధువులున్నట్లు సాగరములు ఉండవు. 

ప్రళయకాలములోనూ సాధువులు మర్యాదను మీరి వర్తించరు. 

అయితే సాగరాలు మీరుతాయి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.