గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 60 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

శావాణీగానసుధాస్రవంతికుశలత్వప్రాభవంబీవు శ

ర్వాణీ! దోసిటఁ గ్రోలుచున్ శిరము కంపంబున్ బొంద శ్లాఘించుటన్,

మాణిక్యాంచిత కర్ణభూషలటులే మార్మ్రోగు కంపించుచున్

దానిన్ సత్ప్రణవంబుఁ బోలెడి ఝణత్కారంబహో! శ్లాఘ్యమే. 60

భావము.

శర్వాణీ ! సరస్వతీదేవి నీ కొలువునకువచ్చి, అమృత ప్రవాహము యొక్క మాధుర్య మృదుత్వములను మించిన మధుర వాక్కులను (కవితలను)నీపై రచించి వాటినిపాడుతూ నీకు వినిపిస్తూ ఉంటుంది అమృత మును పుడిసిళ్ళతో త్రాగేటట్లు, నీవు సరస్వతి మధుర కవితారచనలు (స్తోత్రములను) నీ చెవులనే పుడిసిళ్ళతో చక్కగా త్రాగు తూ వుంటావు (వింటూ ఉంటావు). నీవు సరస్వతీ దేవి చేసిన స్తోత్ర గానంలోని చమత్కారమును ప్రశంశించడానికి తలను కదలిస్తూ ఉంటావు. అప్పుడు నీ చెవులకున్న కర్ణభూషణముల సముదాయము, అధికముగా ఝణ ఝణ ధ్వనులు సరస్వతీదేవి కవిత్వం లోని భావములకు అంగీకారాన్ని తెలిపే , నీ ప్రతివచనము లేమోఅన్నట్లువున్నవి.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.