గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 50 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

చంకవుల కవిత్వసన్మధువు కమ్మగ ప్రీతిని గ్రోలనెంచియున్,

చెవులను వీడనట్టివియు, శ్రీకరమైన సునేత్ర సన్మిషన్,

ప్రవిమల తేజ సద్భ్రమర భాతిని జూచి యసూయఁ జెంది, మూ

డవదగు నేత్ర మెఱ్ఱఁబడె నమ్మరొ నీకు, మనోహరాకృతీ! 50

భావము.
దేవీ కవీశ్వరులు రసవత్తరముగా రచించిన రచనలు
అనే మకరందమును ఆస్వాదించుట యందు ప్రీతి కలిగి నట్టియు , అందుచే చెవుల జంటను విడువ నట్టివియు , నవ రసములనూ ఆస్వాదించుట యందు మిక్కిలి ఆసక్తి కలిగినట్టివియు అయిన నీ కడగంటి చూపులు అనే మిషతో ఉన్న తుమ్మెదల జంటను చూచి , అసూయ చేతనో ఏమో నీ ఫాలనేత్రము కొంచము ఎర్రవారినది.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.