గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 9 || రత్నాదేవి. .. పద్యానువాదం చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

సీపూజ్య పృథ్వీతత్వముగను మూలాధారముననుండు తల్లివి ఘనతరముగ,

జలతత్త్వముగ నీవు కలుగుచు మణిపూర చక్రమందుననొప్పు చక్కనమ్మ!

యగ్నితత్త్వమ్ముగానమరియుంటివిగ స్వాధిష్టానచక్రాన భవ్యముగను,

వాయుతత్త్వమ్ముగా వరలియుంటివి యనాహతచక్రమందుననుతిగ జనని!

తే.గీయలవి శుద్ధచక్రాన నీ వాకసముగ,

మనసువగుచు నాజ్ఞాచక్రముననునిలిచి,

మరి సహస్రారము సుషుమ్న మార్గమునను

చేరి, పతితోడ విహరించు ధీరవమ్మ! 9

భావము.

అమ్మా ! పృథ్వి తత్వముగా మూలాధార చక్రమున, జల తత్వముగా మణిపూర చక్రమున, అగ్ని తత్వముగా స్వాధిష్టానమున, వాయు తత్వముగా అనాహత చక్రమున, ఆకాశ తత్వముగా విశుద్ద చక్రమున,  మనస్తత్వము గా ఆజ్ఞా చక్రమున ఉండి, పైన సుషుమ్నా మార్గము గుండా సహస్రారము చేరి, పతి యగు పరమేశ్వరునితో కలసి విహరించు చున్నావు

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.