గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 67 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

చంజనకుఁడు ప్రేమగా నిమురు చక్కని నీ చుబుకంబు, నీ ధవుం

డనవరతంబు నీ యధరమానెడి వేడ్కను తొట్రుబాటుతోఁ

జనువున పట్టి తేల్చఁబడు చక్కని మోవి, సఖుండు చేతఁ లే

పిన ముఖమన్ లసన్ముకురవృంతము, నాకదిపోల్చ సాధ్యమా. 67

తాత్పర్యము :
హిమగిరితనయా ! తండ్రియైన హిమవంతుడిచే అమిత. వాత్సల్యంతో మునివ్రేళ్ళతో పుడుక బడినదీ, కైలాస పతి చేత అధర పానము నందలి ఆకులత్వం చేత మాటి మాటికి తొట్రు పడుతూ పైకెత్త బడినదీ, శంభుని చేతితో పుచ్చుకో దగినదీ, సాటిలేనిదీ ముఖమనే అద్దంయొక్క పిడీ ఐన నీ చుబుకాన్ని ఏమని వర్ణించగలను ?
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.