గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 5 || రత్నాదేవి. .. పద్యానువాదం చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

నీ యభయమ్మునొంది హరి నేర్పుగ స్త్రీ యవతారమెత్తి, తా

మాయను ముంచె నా శివుని, మన్మధుడున్ నిను పూజ చేయుటన్

శ్రేయము పొందె భార్య రతి ప్రేమను చూరకొనంగఁ గల్గె, సు

జ్ఞేయము నీ మహత్త్వముమిదె, చేసెద నీకు నమశ్శతంబులన్. 5

భావము.

అమ్మా ! లోకములకు సౌభాగ్య ప్రదురాలవు అయిన నీ అభయము వలన విష్ణుమూర్తి స్త్రీ అవతారము ఎత్తి పరమ శివుని కూడా ప్రభావితము చేసెను కదా , అటులనే మన్మధుడు కూడా నిన్ను పూజించి రతీదేవికి ఇష్ట సఖుడే కాక మునుల మనస్సులు కూడా మోహ పెట్టుటకు సరి అయిన వ్యక్తి అయినాడు కదా

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.