గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 55 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

కంనీ కనులు మూసి తెరచిన

లోకప్రళయంబు సృష్టి లోనగునవగున్!

లోకప్రళయము నిలుపన్

నీ కనులను మూయవీవు నిత్యముగ సతీ! 55

భావము.

తల్లీ! పర్వతరాజ పుత్రికా! నీ కనురప్పలు మూతపడడం వల్ల జగత్తుకు ప్రళయమున్నూ , కను రెప్పలుతెరచు కోవడం వలన జగత్తు సృష్టించ బడుతుందని పండితులు తెలుపుచున్నారు. విధంగా నీనిమేష, ఉన్మేషముల వలన జగత్తు యొక్క ఉత్పత్తి వినాశ ములు జరుగుతున్నవని , దానిని ప్రళయము నుండి రక్షించు కొనుటకై నీ రెప్పలు వికసించుట వలన పుట్టిన సర్వ జగత్తునూ నాశనం పొందకుండా కాపాడడానికై, నీవు కనురెప్పలు మూయడం మానివేశావని భావిస్తున్నాను.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.