గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 18 || రత్నాదేవి. .. పద్యానువాదం చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

శాప్రాతఃకాలరవిప్రభారుణరుచిన్ భాసిల్లు నిన్ గొల్చునా

శీతాంశుల్ కవిచంద్రులే కనగ రాశీభూత భక్తిద్యుతుల్,

నీ తత్త్వజ్ఞులు వారు, సత్య గతివౌ నిన్నాత్మలన్ నిల్పుచున్

ఖ్యాతినివెల్గెడి పుణ్యమూర్తులిల, స్త్రీవ్యామోహదూరుల్ సతీ! 18

భావము.

అమ్మా ! ఉదయపు సూర్యుని శోభను పోలిన శోభ కలిగిన నీ శరీరమును ఎఱ్ఱ దనముతో నిండిన ఆకాశముగా ఎవ్వరు పూజించు చున్నారో అట్టి వారు, తొట్రుపాటు పడుచూ అడవుల యందున్న లేళ్ళ కన్నుల వంటి కన్నులు కల అప్సరసలకు సైతము వశము కారు కదా

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.