గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 54 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.


జైశ్రీరా మ్.
ఓం శ్రీమాత్రే నమః.

శామమ్ముం జేయగ సత్ పవిత్రులుగ నమ్మా! సద్దయార్ద్రంపు శో

ణమ్మున్ శ్వేతము,కృష్ణమున్,గలుగు జ్ఞానంబిచ్చు నీ మూడు నే

త్రమ్ముల్గంగను,శోణ నా యముననిద్ధాత్రిన్ గృపన్నొక్కెడన్

నెమ్మిన్ నిల్పెనొకో గుణత్రయమటుల్, నిన్ గొల్వ నాకెట్లగున్? 54

భావము.

పశుపతియైనశివునియందులగ్నమైనచిత్తము కలదానా ! దేవీ దయారసముతో కూడిన ఎరుపు, తెలుపు, నలుపు కాంతులు కలవైన నీ కన్నులచే ఎర్రని జలప్రవాహముగల శోణ నదము, తెల్లని జల ప్రవాహము గల గంగ, నీల జలప్రవాహముగల యమున అనే మూడు నదుల సంగమ స్థానమును మమ్ము లను పవిత్రులనుగాచేయటానికైమాకుసంపాదించిఇస్తున్నావు.ఇదినిజము.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.