గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 62 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్
ఓం శ్రీమాత్రే నమః.

జననీ! నీ యధరారుణప్రభలు సాజంబమ్మ! నే దెల్పెద

న్వినుతింపందగు పోలికన్, విద్రుమమే నేర్పున్ ఫలంబున్ గనన్

ఘనమౌ నీయధరారుణప్రభలనే కల్గించునవ్వాటికిన్,

విన సొంపౌ తగు సామ్యమున్ దలపగా వ్రీడన్ మదిన్ బొందదే? 62

భావము.

అమ్మా జగజ్జననీ, స్వభావ సిద్ధముగానే కెంపురంగుగల నీ పెదవుల అందమునకు,  సరియైన పోలికను చెప్పుచున్నానుపగడపు తీగె,  పండును పుట్టించిగలిగినచో  నీ రెండు పెదవులు దానికి సరిపోతాయి. అది నీపెదవులకాంతితోపగడపండ్లనుపోలుటకుసిగ్గుపడును.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.