గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 42 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

సీహిమగిరి నందినీ! సముచితముగ సూర్యులందరిన్ మణులుగ పొందబడిన

నీ స్వర్ణమకుటమున్ నియతితో కీర్తించునెవ్వం  డతం డిల నెంచకున్నె

ద్వాదశాదిత్యుల వర్ధిల్లు మణికాంతి సోకుచు నొప్పెడి సోముని గని

యింద్ర ధనుస్సుగా, సాంద్రకృపాంబ! తత్ కల్యాణతేజంబు ఘనతరంబు.

తే.గీ. నీ కిరీటంబు తేజంబు నే దలంచి

యాత్మలోతృప్తినందెదనమ్మ కృపను

నీవు నామదిలోననే నిలిచి యుండి

మకుట తేజంబు కననిమ్ము సుకరముగను. 42
భావము.

హిమగిరితనయా ! పార్వతీ ! మణి భావమును పొందిన ద్వాదశ సూర్యుల చేత దట్టముగా కూర్పబడిన నీ బంగారు కిరీటాన్ని ఎవడు కీర్తిస్తాడో _ కవీశ్వరుడు గోళాకారంగాయున్న కిరీటములో కుదుళ్ళయందు బిగించబడిన ద్వాదశాదిత్యులనే మణుల కాంతుల ప్రసారంతో, చిత్ర విచిత్ర వర్ణములు గల చంద్ర ఖండాన్ని చూసి , అది ఇంద్రుని ధనస్సు అని ఎందుకు భావన చేయకుండా వుంటాడు. (చంద్ర రేఖను తన మనస్సులో ధ్యానించి ధ్యానించి అది తప్పక ఇంద్రధనుస్సు అని నిశ్చయ బుద్ధి ని కల్గించు కుంటాడని భావము ) పండ్రెండుగురు సూర్యులు దేవి కిరీటములో మణులైయుంటారు. అందులో చంద్ర రేఖ కూడా వుంటుంది. సూర్య కాంతుల ప్రతిఫలంతో కూడిన చంద్ర వంక వర్ణించు వారికి ఇంద్రధనుస్సనే భావాన్ని తప్పక కల్గిస్తుంది.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.