గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 44 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

ఓం శ్రీమాత్రే నమః.

నీ ముఖ శోభ నుండి గణనీయముగా ప్రవహించుచున్న  యా

శ్రీమహిమంపు పాపటి  ప్రసిద్ధ మహత్కర కుంకుమ ప్రభల్

రోమతమిస్రశత్రుతతిలోపలఁ చిక్కినబాలసూర్యుఁడే,

క్షేమము సంపదల్ మరియు శ్రీకర యోగము మాకుఁ గొల్పుతన్, 44

భావము.
దేవీ ! నీ పాపటయందు సిందూరపు రేఖ యున్నది
సిందూరముతో నున్న నీ సీమంత మార్గము (పాపట దారి ) నీముఖసౌందర్యము పొంగులు పొంగి ప్రవహించే ప్రవాహము నుండి, చీలి పైకి ప్రవహించేనీటి పాయ యొక్క ప్రవాహపు దారి ఏమో అన్నట్లు ఉన్నది . అంతేకాదు దట్టము లయిన నీ కేశపాశములు , సాంద్రములైన చీకట్లవలె ఉన్నవి. చీకట్లకు సూర్యునికి విరోధము. కాబట్టి చీకట్లు అనే బలమైన శత్రువు చేత చెర బట్టబడిన బాల సూర్యుని కిరణమేమో యన్నట్లు నీనల్లని కురుల మధ్య సిందూర పరాగమును ధరించిన పాపట కనిపిస్తున్నది. ఇటువంటి నీ పాపటరేఖ మాకు యోగక్షేమములను అభివృద్ధి ని పొందించును గాక.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.