గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 84 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

శా నీ పాదజలంబులాయెను హరుండే తాల్చు నా గంగయే,

యే నీ పాదపు కాంతిఁ గొల్పు నజగుండే దాల్చు చూడామణి

న్నే నీ పాదములన్ ధరించు శ్రుతులున్ ధ్యేయంబుతో నెప్పుడు

న్నా నీ పాదములుంచు నాదు తలపైనమ్మా! కృపన్, నిత్యమున్. 84

భావము

లోకమాతా ! నీ చరణాలకు శివుడి జటాజూటంలో వర్తించే గంగ పాదప్రక్షాళన జలం అవుతుందో , నీ చరణలత్తుక రసంపు కాంతికెంజాయలు శ్రీ మహావిష్ణువు మణిమయ కిరీటానికి వెలుగును ఆపాదిస్తున్నాయో , శ్రుతులశిరస్సులైన ఉపనిషత్తులు నీ పదాలను సిగపువ్వుగా ధరిస్తున్నవో, మాతా! కృపతో కూడిన చిత్తంగల దానవైన నీవు , నీ చరణాలను నాశిరస్సుమీద కూడా ఉంచు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.