గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 47 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

తే.గీభువన భయ హర వ్యసన! కన్ బొమలు నీవి

మరుని విల్ త్రాడు లాగెడి కరణినొప్ప,

పిడికిటనుపట్టి యున్నట్లు వింటిత్రాడు

మధ్య కనరాని మరువిల్లు మదిని తోచు. 47
భావము.
ఉమాదేవీ! లోకములయొక్క భయాన్ని పోగొట్టుటయందు ఆసక్తి గల తల్లీ ! నా కంటికి నీ కనుబొమలు మన్మథుని ధనస్సువలె అగుపిస్తున్నాయి. తుమ్మెదల కాంతివంటి కాంతి కల్గిన నీ కన్నులు, ఆధనుస్సుకుకూర్చబడిన వింటినారివలె కనిపిస్తూ ఉన్నాయి . నీ కనుబొమలు కొంచెము వంగి ఉన్నాయి . మన్మథుడు ఆవింటిని తన ఎడమచేతి ముంజేతితోనూ ,పిడికిలితోనూ పట్టుకొన్నందువల్ల వింటి నడిమి భాగము కానరాక దాగియున్న మన్మథుని కోదండముగా (విల్లుగా) నాకంటికి తోచుచున్నది.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.