గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 90 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

ఘన మందార సుపుష్పగుచ్ఛములు నీకల్యాణపాదాళి, భా

వనఁ జేయంగ మరందముల్ జిలుకుచున్ భాగ్యాళినిచ్చుంగదా,

నిను భావించెడి నాదు జీవన సుకాండిక్షోభలే వాయుతన్

వినుతిన్ నీపదపద్మసన్మధువులేప్రీతిన్ సదా క్రోలుటన్. 90

భావము.

అమ్మా, దరిద్రులకు సిరిసంపదలను ఎల్లప్పుడూ వారివారి యుక్తమైన కోరికలకు అనుగుణముగా అనుగ్రహించెదవు.  అట్టి అధిక సౌందర్యముయొక్క గుణములు అను తేనెనువెదజల్లుతున్నదియు మందార కల్ప వృక్షముయొక్క పుష్పగుచ్ఛం నీ పాదమునందు ఉంచి మనస్సు కర్మ వాచా అనగా ఇంద్రియములతో భక్తుడు నమస్కారము. భ్రమరకీటకము వలె   భావమును పొందెదను గాక.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.