గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, ఆగస్టు 2024, బుధవారం

తృణతులితాఖిల జగతాం .. మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  తృణతులితాఖిల జగతాం - కరకలిత త్రయీరహస్యానాం |

శ్లాఘావరవధూటీ - ఘటదాసత్వం సుదుర్నిరసం || (సదాశివ బ్రహ్మేంద్రులు)

తే.గీ.  లోకమును గడ్డిపోఁచగా లోననెంచు,

వేదవిదులైనవారికిన్ మోదముండు

కీర్తికాంతపై, నుతులపై, కేవలమిది

దైవమును శరణము వేడఁ దలగిపోవు.         

భావము.  లోకాన్నే తృణంగా పరిగణించే సన్న్యాసులకూ, వేదవేదాంతముల 

రహస్యములను ఎఱిగినవారికి కూడా కీర్తి మత్తు ప్రశంసలపై అభిలాష సులభంగా 

తొలగి పోజాలదు. ఇది భగవంతుని మాయయొక్క విశిష్టమైన ప్రభావము. 

మాయ 'నేను, నాది' అనే అహంకార మమకారములతో ఎంతటివారినీ 

మరులుగొల్పుతుంది. దీనికి భగవంతుని ఆశ్రయమును అవలంబించుటయే 

పరిహారము.

జైహింద్.

Rephrase with Ginger (Ctrl+Alt+E)
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.