గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 64 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

చంసతతము నీ సదాశివుని సన్నుతిఁ జేయుచునుండుటన్ సతీ!

యతులిత జిహ్వ యెఱ్ఱఁబడెనమ్మరొనీకు, గణించగా, సర

స్వతి సతతంబు నాల్కపయి సన్నుతినొప్పుచునుండుటన్ లస

న్నుతమగు పద్మరాగరుచితోపరిణామము పొందియుండెడిన్. 64

భావము.

నిరంతరము సదాశివుని గుణ గణములుగల వృత్తాంతమును మరల మరల వచించుటవలన నీ నాలుక ఎర్రబడ్ఢది. నీ జిహ్వాగ్రమునందు సరస్వతీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. అందువలన ఎర్రరంగుగా మారినది.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.