గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 72 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

. నీ కుచ యుగ్మముం గని గణేశుఁడు కుంభము శీర్షమచ్చటన్

ప్రాకటమొప్పకల్గినటు భావనఁ జేయుచునుండె శంకతో,

నేక నిమేషమందునె గణేశునకున్ మరి శూర క్రౌంచభే

ద్యాకలిఁ దీర్చు నీ చనులు హాయిగ మమ్ములఁ గాచుఁగావుతన్. 72

భావము.

అమ్మా! పాలు కారుచున్న నీ వక్షముల జంటను చూసి గణపతి తన శిరస్సు కుంభములు ఇచ్చటకు వచ్చెనేమో అని తలచి తొండముతో తన తలను తాకి చూసుకుంటున్నాడు కదా. ఒకే సమయమున కుమారులు అయిన గణపతి, కుమారస్వాము చేత పానము చేయబడినవో, అట్టి స్తన ద్వయము మాకు మేలు కలిగించును. కదా !

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.