గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 8 || రత్నాదేవి. .. పద్యానువాదం చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

సీఅమృత సింధువు మధ్య నమరిన రతనాల దీవియందున్నట్టి దివ్యమైన

కల్పవృక్షంబుల ఘన కదంబముల పూ తోటలోపలనున్న మేటియైన

చింతామణులనొప్పు శ్రీకరంబైనట్టి గృహములో శివునియాకృతిగనున్న

మంచంబున శివుని మంగళోరువు గొప్ప స్థానంబుగా కల జ్ఞానపూర్ణ

తే.గీవరదయానంద ఝరివైన భవ్యరూప!

ధన్య జీవులు కొందరే ధరను నీకు

సేవచేయగాఁ దగుదురు, భావమందు

నాకు నీవుండుమా జగన్మాత! కృపను. 8

భావము.

అమ్మా ! అమృత సముద్రము మధ్య భాగమున ఉన్న రతనాల దీవి యందు కల్ప వృక్షములు, కదంబ పూతోట లోపల చింతామణులతో నిర్మిచబడిన గృహము నందు శివుని రూపముగా గల మంచమున పరమ శివుని తొడయే స్థానముగా గల జ్ఞానానంద ప్రవాహ రూపిణియగు నిన్ను కొందరు ధన్యులు మాత్రమే సేవించు చున్నారు

జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.