గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 31 || రత్నాదేవి. .. పద్యానువాదం చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

సీఅరువదినాలుగౌ యపురూప తంత్రముల్ ప్రభవింపఁ జేసెను భవుఁడు తలచి,

యొక్కొక్కటొక్కొక్కటొప్పుగానొరలించు కోరిన విధముగా దారి చూపు,

హరుఁడు విశ్రమమొంద, హరుపత్నియౌ దేవి హరుని యాజ్ఞనుగొని వరలఁజేసె

శ్రీవిద్యననితరచిద్భాసమగు విద్య, విశ్వమందున బ్రహ్మ విద్య కలుగ

తే.గీనాత్మనే దెల్పెడి దరయ నాత్మ విద్య,

రెంటికిసమన్వయముగూర్చి శ్రేయమునిడు

నట్టిదగు విద్య శ్రీవిద్య, పట్టినేర్వ

ముక్తి నిడునట్టి విద్య యీ పూజ్య విద్య.  31

భావము.
అమ్మా, భగవతీ! పశుపతి అరవై నాలుగు విధాలైన మహామాయా శంబరాది తంత్రాలను భూమండలంలో ప్రవేశపెట్టాడు . సకలసిద్ది ప్రదాయకమూ , ఐహిక ఫల ప్రదాయికాలూ ఐన తంత్రాలద్వారా సమస్త ప్రపంచాన్ని మోహింపజేసి మిన్నకున్నాడు .మళ్ళా నీ అభీష్టం మేరకు ధర్మార్ధ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్ధాలను ప్రసాదించేదైన నీ తంత్రాన్ని ( శ్రీవిద్యా తంత్రాన్ని ) లోకానికి ప్రసాదించాడు .
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.