గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 14 || రత్నాదేవి. .. పద్యానువాదం చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

సీభూతత్త్వముననొప్పి పూజ్య మూలాధార ముననేబదారు కిరణములుండ,

జలతత్త్వముననున్న చక్కని మణిపూరముననేబదియురెండు ఘనతనుండ,

నగ్నితత్త్వంబుననలరి స్వాధిష్ఠానముననరువదిరెండుప్రనుతినుండ,

వాయు తత్త్వముతోడవ ననాహతమునందు నేబది నాలుగుధృతిని యుండ,

నాకాశ తత్త్వాన నలవిశుద్ధమునందు డెబ్బదిరెండుఘటిల్లియుండ,

మానస తత్త్వాన మహిత యాజ్ఞాచక్రముననరువదినాల్గువినుతినొప్ప

తే.గీనట్టి వాని సహస్రారమందునున్న

బైందవ స్థానమున నీదు పాదపంక

జంబు లొప్పి యుండును తేజసంబు తోడ,

నట్టి నిన్ గొల్తునమ్మరో! యనుపమముగ. 14

భావము.

అమ్మా ! సాధకుని దేహమందు పృధ్వీ తత్వముతో ఉన్న మూలాధారమునందు ఏబది ఆరును, జల తత్వముతో ఉన్న మణిపూరము నందు ఏబది రెండునూ, అగ్నితత్వమగు స్వాదిస్ఠానమునందు అరువది రెండునూ, వాయుతత్వముతో కూడిన అనాహతమునందు ఏబది నాలుగునూ, ఆకాశతత్వమయిన విశుద్ధచక్రమునందు డెబ్బది రెండునూ, మనస్తత్వముతో కూడిన ఆజ్ఞాచక్రమందు అరువది నాలుగున్నూ కిరణములు గలవో వాని పై భాగమున ఉండు సహస్రదళ మధ్యనున్న బైందవ స్థానమున నీ యొక్క పాదముల జంట నర్తించును,. 

 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.