గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 70 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమత్రే నమః.

శాఅమ్మా! శూలి నఖంబులన్ జిదిమె తా నాబ్రహ్మ శీర్షంబటం

చిమ్మారక్షణ మాకటంచు గిలితో నీశాని! శీర్షంబులన్

నెమ్మిన్ నీ మృదుహస్తపల్లవములన్ నేర్పార వేడెన్, భళీ!

యిమ్మా మాకును నీదురక్ష జననీ! హృద్యంబుగా నెల్లెడన్. 70

భావము.  :
అమ్మా! బ్రహ్మ అంధకాసురినికి విరోధి అయి వానిని వధించిన పరమ శివుడు, తన అయిదవ తలను తన గోళ్ళతో పెరికి వేయుట వలన మిక్కిలి భయపడిన వాడయి తన నాలుగు తలలతో తనకు అభయ హస్తమును ఇమ్మని తామర తూడుల వలె మృదువయిన నీ నాలుగు చేతులనూ ప్రార్ధించు చున్నాడు కదా!

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.