జైశ్రీరామ్.
సుభాషితమ్
శ్లో|| ఖలః సర్షప మాత్రాణి - పర చ్ఛిద్రాణి పశ్యతి|
ఆత్మనో బిల్వ మాత్రాణి - పశ్యన్నపి న పశ్యతి||
తే.గీ. దోష మావంతయున్ గనున్ దురితుఁ డన్యు
లందుఁ, గన నేరఁడే తన యందుఁ గలుఁగు
బిల్వ ఫలమంత దోషమున్, వింత యిదియె,
యాత్మవంచన, పరనింద, యఘము కాదె?
భావము. మూర్ఖుడు ఇతరులలోని ఆవగింజంత దోషాన్ని కూడా చూచును. తనయందు
మారేడు పండంత దోష మున్ననూ చూసి చూడనట్లే వ్యవహరించును.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.