గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, సెప్టెంబర్ 2023, గురువారం

యస్తే దదాతి రవ మస్య వరం దదాసి ....

 జైశ్రీరామ్.

రెంటాల సాంబశివరావు గారికి నమస్కృతులతో.

శ్లో.  యస్తే దదాతి రవ మస్య వరం దదాసి

యో వా మదం వహతి తస్య దమం విధత్సే।

ఇత్యక్షర ద్వయ విపర్యయ కేళి శీల!

కిం నామ కుర్వతి నమో న మనః కరోషి।।

ఈ శ్లోకం లో అక్షరద్వయం విపర్యం అవడం గమనించండి...

యః - ఎవ్వడైతే,

తే - నీకు,

రవం - ధ్వనిని,

దదాతి - ఇస్తాడో,

తస్య - వానికి,(రావణునికి),

వరం - వరాన్ని,

దదాసి - ఇస్తావు.

యః వా - ఎవ్వడైతే,

మదం - గర్వాన్ని,

వహతి - పూని ఉంటాడో,

తస్య - వానికి

,(యముడు,భస్మాసురుడు వంటి వాళ్ళకి),

దమం - అణచివేయుట అనే శిక్షని,

విధత్సే - విధిస్తావు కదా!

ఇతి - ఈ విధంగా,

అక్షర ద్వయ - అక్షరముల జంటను,

విపర్యయ - మార్చుట అను,

(రవం-వరం ;

మదం - దమం;

నమః - మనః)

కేళి- విలాసములో,

లోల - తేలియాడేవాడా!

ఓ దేవా! శివా!

నమః - నమస్కారం,(నమః),

కుర్వతి - చేయునట్టి (నా పట్ల),

మనః - మనస్సు పెట్టుట,(మనః)

న కరోషి - చేయవు,

కిం నామ - ఎందుకో గదా।।

జగద్ధర భట్టు అనే కవి ఈ శ్లోకంలో శివుని వ్యాజస్తుతి చేస్తున్నాడు,

"ఓ దేవా! శివా! నిన్ను గురించి రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తేటప్పుడు 

పెద్దగా అరిచాడు.("రవం" చేశాడు)(-అందుకే "రావణుడు"అయ్యాడు).

వానికి"వరం" ఇచ్చావు.

గర్వించిన("మదం"తో విర్రవీగిన)రాక్షసులని అణచివేశావు ("దమం").

ఈ విధంగా జంట అక్షరాల పదాలతో ఆటలాడుకునే లీలావిలాసము గల 

ఓ దేవా! పరమేశ్వరా! 

అదే విధంగా నేను నీకు నమస్కరిస్తే ("నమః") నా పట్ల నీవు ఎందుకు 

మనస్సు ("మనః")పెట్టవో గదా!!

జైహింద్

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.