జైశ్రీరామ్.
శ్లో. ప్రియవాక్య ప్రదానేన - సర్వే తుష్యంతి జంతవః|
తస్మాత్తదేవ వక్తవ్యం - వచనే కా దరిద్రతా||
తే.గీ. ప్రియముగా పల్క జీవాళి ప్రీతిఁ జెందు,
మంచి మాటచే గొనవచ్చు మంచిపేరు,
కాన ప్రియముగాపలుకుము, కాదనకుము,
మాటలాడగ లోటేమి? మహిత సుగుణ!
భావము. సంతోషం కలిగే మాట మాట్లాడినచో అందరూ ఆనందిస్తారు.
అందువల్ల అలాంటి మాటనే మాట్లాడాలి. అలా సంతోషం కలిగించే
మాట మాట్లాడం వల్ల వచ్చే దరిద్రమేమున్నది ?[అనగా?ఎలాంటి కష్టము
ఉండదని భావము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.