గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, సెప్టెంబర్ 2023, బుధవారం

శ్రీకృష్ణాష్టమి సందర్భముగా శుభాకాంక్షలు.

 జైశ్రీకృష్ణ!🙏🏼

శ్రీకృష్ణాష్టమి సందర్భముగా శుభాకాంక్షలు.💐🍒


శ్రీకృష్ణం వందే జగద్గురుమ్.

శా.  లీలామానుషవిగ్రహుండు హరి సల్లీలన్ జగత్పాలనన్

హేలన్ జేసెడివాడు మిమ్ము సతమున్ హృద్యంబుగా గాంచుచున్,

బాలించున్ సుధలీను మానసమునన్ వర్తిల్లుచున్ బ్రీతితోన్,

శ్రీలక్ష్మీసహితుండు మీకు సఖుఁడై శ్రీలన్ బ్రసాదించెడిన్.

మీ హృదయమున నెలకొనియున్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ 

నిత్యమూ మిమ్ము సన్మార్గమున

 ప్రవర్తింపఁజేయుచు రక్షించుచుండుగాక.🙏🏼

జైశ్రీకృష్ణ.

చింతా రామకృష్ణారావు.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.