గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, సెప్టెంబర్ 2023, గురువారం

ద్రాగిన వాని జీవితము ధన్యమగున్ ధరలోన జూడగన్. నేను చేసిన సమస్యాపూరణము.

  జైశ్రీరామ్.

ఉ.  యోగము భక్తిముక్తుల ననూన విధంబున పొందుటెన్నగా

శ్రీగిరిరాజకన్యక ప్రసిద్ధపదాంబుజ భావనా సుధన్

వేగమె గ్రోల లభ్యమగు, ప్రీతిని బొందగ భక్తినాసుధన్

*ద్రాగిన వాని జీవితము ధన్యమగున్ ధరలోన జూడగన్.*

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.