వర్ధమాన అవధానకవులకుపయోగించే క్రొత్తప్రయోగాలు 🌹
🌹 ఇష్ఠన్ ప్రత్యయాంతాలు 🌹
సంస్కృత పాణినీయంలో తద్ధిత ప్రకరణంలో కొన్ని ఇష్ఠన్.ప్రత్యయాంతాలైన విశేష శబ్దాలు చెప్పబడ్డాయి.అట్టిచోట్ల ప్రాతిపదిక వేరూ పరిణిష్ఠిత రూపం వేరుగానూ ఉంటాయి.వానిని వర్ధమాన కవుల ఉపయోగార్థం ఇక్కడ అందిస్తున్నాను.
పాణినీయం ప్రాగివీయ ప్రకరణం లో 🔺 అతిశాయనే తమబిష్ఠనౌ 🔺అని తమ , ఇష్ఠన్ ప్రత్యయాలు చెప్పబడ్డాయి.అతిశాయనం అంటే ఉత్కర్ష ,అధికంగా ,మిక్కిలి అని అర్థాలు.
ఉదా. అతిశయేన లఘుః = లఘుతమః , లఘిష్ఠః. పటిష్ఠః .ఈప్రత్యయాలు సాధారణంగా స్వార్థంలో అన్ని ప్రాతిపదికల మీదా ఉన్న అర్థమే మరింత ఉత్కర్షగా చెప్పలసి వస్తే వస్తాయి..అలావచ్చినప్పుడు ప్రాతిపదికు టిలోపం వస్తుంది. అందుకే "లఘు +ఇష్ఠ అనిఉండగా" ఘు"లోని ఉకారం లోపించింది.
కొన్నిచోట్ల ఇష్ఠన్ వచ్చినతరువాత కూడా మరింత ఉత్కర్ష కోసం తమ ప్రత్యయం కూడాచేసారు మనపెద్దలు.🥀ఉదా. శ్రేష్ఠతమః . 🥀
వీనిని ప్రయోగ ప్రమాణాలననుసరించి మనం ప్రయోగించడం మంచిది.
అయితే కొన్ని ప్రాతిపదికలకు ఇష్ఠన్ వచ్చినప్పుడు అనేక విశేషాలు రావడంతో తిరిగి
" *ప్రియ స్థిర స్ఫిరౌరు......"( 6 . 4 .157 ) మున్నగువిధంగా విశేషమైన సూత్రంచెప్పారు పాణిని మహర్షి.అవి పరిశీలించి తెలుసుకొందాం.
🌷1. ప్రేష్ఠః 🌷ప్రియ శబ్దానికి మిక్కిలి ఇష్టమైనవాడు అన్న అర్థం లో "ప్రియ + ఇష్ఠ = ప్రేష్ఠః
2.🥀 స్థిర + ఇష్ఠ = స్థేష్ఠః = మిక్కిలి స్థిరమైన.
3🥀 స్ఫిర+ ఇష్ఠ = స్ఫేష్ఠః = ప్రచురమైన .
4🥀 ఉరు +ఇష్ఠ = వరిష్ఠః . మిక్కిలి గొప్పవాడు.
5🥀 బహుళ +ఇష్ఠన్ "= అతిశయేన బహుళః.
బంహిష్ఠః .= మిక్కిలి వృద్ధి పొందిన.
6🥀 గురు + ఇష్ఠన్ = గరిష్ఠః ."= మిక్కిలి గురువైన
7🥀వృద్ధ + ఇష్ఠన్ = వర్షిష్ఠః ""=మిక్కిలి వృద్ధుడు.
8🥀 తృప + ఇష్ఠన్.= త్రపిష్ఠః = మిక్కిలి సిగ్గుపడ్డం.
9.🥀దీర్ఘ + ఇష్ఠ = ద్రాఘిష్ఠః .మిక్కిలి పొడవైన.
10🥀బృందారక + ఇష్ఠ = బృందిష్ఠః. బృందారక శబ్దానికి "బృంద" అన్న ఆదేశం వచ్చింది.
11🥀 శ్రేష్ఠః . అతిశయేన ప్రశస్యః.మిక్కిలి ప్రశంసింప దగినవాడు.
ఇలా ప్రయోగసిద్ధాలైన అనేక క్రొత్తప్రయోగాలు మూడులింగాల్లోనూ కవులు సేవించవచ్చు.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.