గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, సెప్టెంబర్ 2023, మంగళవారం

శ్రీ వసంతతిలక సూర్యశతకము 96 నుండి 100 వరకు... రచన చింతా రామకృష్ణారావు.... గానం శ్రీమతి సిశీలాదేవి.బీ.

 జైశ్రీరామ్.

96. భద్రాకృతింగొలిపి భక్తిని గొల్పు వాఁడా!  

నిద్రాస్థితిన్ మడఁచి, నిస్పృహఁ బాప రమ్మా.

భద్రేభరక్షకుని పావన దర్శనంబున్ 

మద్రక్షకా! కొలుపు మాకిక సూర్యదేవా! 

 

97. దర్పోద్ధతుల్ కలరు, తప్పవు దండనాదుల్. -

కర్పూరహారతులు గౌరవమొంది పొందన్. 

తూర్పారఁబట్టి యిక త్రుంచుము దుర్జనాళిన్ -

కార్పణ్యమున్ మడఁచు జ్ఞానద! సూర్యదేవా!

 

98. స్త్రీ జాతికిన్ శుభము చేయఁగ జాగదేలో

భూజాతయున్ పుడమినోర్చెను బాధలెన్నో.

స్రీ జాతిఁ బ్రోవ మనసే కరువాయె నీకున్. 

రాజిల్ల చేయుము. పరాత్పర! సూర్యదేవా! 


99. నీచే సమస్తమును నిండుగ సాగుచుండున్. 

నీచే ప్రజాపతియు నేర్పగ మెల్గుచుండున్.

నీచే కవిత్వ కమనీయత వెల్గుచుండున్. 

నీచే మనంగను మనీషులు సూర్యదేవా!  

 

100. ఆరోగ్యమిచ్చుచు, మహాత్ముఁడ! పాఠకాళిన్ 

వీరోచితంబుగనె వెల్గఁగఁ జేయుమయ్యా.

నీరేజ మిత్ర! మననీయుము సజ్జనాళిన్. 

నీ రమ్య నామమె గణింతును సూర్యదేవా!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.